అల్లు అర్జున్ సినిమా పై మాటల మాంత్రికుడు ప్రత్యేక దృష్టి..!

” గుంటూరు కారం ” సినిమాతో తన టాలెంట్ ని తగ్గించుకున్నాడు త్రివిక్రమ్. ఇక ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో రాబోయే తన కొత్త ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమాని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన ఈ కాంబో మరోసారి రిపీట్ అవ్వడంతో భారీ అంచనాలు నెలకున్నాయి. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా పాన్ వరల్డ్ సినిమాగా రిలీజ్ కానుంది. అందుకే ఈ సినిమా విషయంలో త్రివిక్రమ్ చాలా కేర్ తీసుకుంటున్నాడట. ఇప్పటికే త్రివిక్రమ్ స్క్రిప్ట్ ఫైనల్ చేసినా.. గుంటూరు కారం ఫలితం తరువాత బన్నీతో చేయబోయే సినిమా కథ పై మరింతగా కసరత్తులు చేయాలని నిర్ణయించుకున్నాడట.

మొత్తానికి తమ నాలుగో సినిమాని త్రివిక్రమ్ మరియు బన్నీ చాలా గ్రాండ్ లెవెల్ లో ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నారు. టైటిల్ మరియు ఇతర వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. హారిక హాసిని క్రియేషన్స్ మరియు గీత ఆర్ట్స్ కలిసి ఈ భారీ ప్రాజెక్టుని నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమాకి కూడా థమన్ ఏ సంగీతం అందిస్తున్నాడు.