“ఒరేయ్ ..వద్దు రా..” అంటూ ప్రభాస్ బ్రతిమలాడిన .. ఎన్టీఆర్ చేసిన మూవీ ఇదే..!

సినిమా ఇండస్ట్రీలో చాలా చాలా మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. అయితే కొంతమంది ఫ్రెండ్షిప్ బయటకు కనిపించేస్తుంది. మరి కొంతమంది ఫ్రెండ్షిప్ బయటకు కనిపించదు. అలా కనిపించకుండా ఫ్రెండ్షిప్ మైంటైన్ చేసే వాళ్ళల్లో ఒకరే ప్రభాస్ – ఎన్టీఆర్. వీళ్లిద్దరూ చాలా చాలా మంచి ఫ్రెండ్స్ ఎంతలా అంటే ఒరేయ్.. రారా.. పోరా అని పిలుచుకునే ..అంత మంచి ఫ్రెండ్స్ అయితే ప్రభాస్ ఇచ్చిన సలహాను పాటించకుండా ఎన్టీఆర్ పెద్ద తప్పే చేశాడు .

దానికి భారీ మూల్యం కూడా చెల్లించుకున్నాడు. ప్రభాస్ తన వద్దకు వచ్చిన కథను రిజెక్ట్ చేశాడు . ఆ కథలో కంటెంట్ లేదు అంటూ ఓపెన్ గా చెప్పుకు వచ్చాడు . అయితే అదే కథను డైరెక్టర్ తీసుకెళ్లి ఎన్టీఆర్కు వివరించారు . ఎన్టీఆర్ ఆ కథను ఓకే చేసేసాడు . అయితే ఎన్టీఆర్ ఎక్కడ ఫ్లాప్ తన ఖాతాలో వేసుకుంటాడు అన్న భయంతో ప్రభాస్ వెంటనే ఆ సినిమా నుంచి తప్పుకోమంటూ కాల్ చేసి సజెస్ట్ చేశారు .

కానీ అప్పటికే అగ్రిమెంట్ పై సైన్ చేసేసిన ఎన్టీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి సినిమా ఫ్లాప్ అవుతుంది అని తెలిసినా కూడా ఆ సినిమాలో నటించాడు . ఆ సినిమా మరేదో కాదు “రామయ్య వస్తావయ్య”. ఎన్టీఆర్ కెరియర్ లోనే డిజాస్టర్ మూవీ గా నిలిచింది. ఈ సినిమా తరువాత హిట్ కొట్టడానికి తారక్ ఎన్ని కష్టాలు పడ్డాడొ అందరికి తెలిసిందే..!!