మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్… త్వరలోనే రానున్న మెగా బయోగ్రఫీ.. ఇక ఒక్కొక్కడికి పూనకాలేగా..!

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయ‌న‌ ఇటీవలే తన బయోగ్రఫీ తీస్తున్నట్లు క్లారిటీ తన జీవిత చరిత్ర పుస్తకం రాసే బాధ్యతను ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌కు అప్ప చెప్పినట్లు చిరంజీవి స్వయంగా వెల్లడించడంతో మెగా ఫాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు.

ఇక ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ..” నేను పెద్ద స్టార్ గా ఎదగడానికి యండమూరి రచనలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఆయన సినిమాలతోనే నాకు మెగాస్టార్ బిరుదు వచ్చింది. ఆయన నా బయోగ్రఫీ రాస్తుండడం నాకు ఎంతో సంతోషకరంగా ఉంది ” అంటూ కామెంట్స్ చేశారు చిరంజీవి.

ఇక మెగాస్టార్ చిరంజీవి హీరోగా యంగ్ దర్శకుడు వశిష్ఠ తో విశ్వంభరా అనే సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ ఫాంటసీ సినిమాగా తెరకెక్కనుంది. ఇక ఈ మూవీ అనంతరం మెగాస్టార్ తన బయోపిక్ పై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతుంది.