ధనుష్ – నాగార్జున మూవీకి సంగీతం అందిస్తున్న ఆ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్..!

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ ” కెప్టెన్ మిల్లర్ “తమిళ్లో రిలీజ్ అయింది మంచి టాక్ని సొంతం చేసుకుంది. ఇక జనవరి 25న తెలుగులో రిలీజ్ కానుంది ఈ మూవీ. ఇక తాజాగా తన తెలుగు దర్శకుడు శేఖర్ కమ్ముల తో ఒక భారీ సినిమా మొదలుపెట్టాడు ధనుష్.

ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కీలక పాత్రలో వహిస్తున్నాడు. ఈ సినిమాని గ్రాండ్ లెవెల్ లో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు గ్రాండ్గా నిర్మిస్తున్నాయి. ఇక ఈ క్రేజీ ప్రాజెక్టు లోకి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ రాక్స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ని ఆహ్వానిచ్చినట్లు మేకర్స్ ఓ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు. ఇక దీంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి.

ఇక ఈ మూవీ అనంతరం బ్లాక్ బస్టర్ హిట్ కనుక కొడితే వీరి కెరీర్ పూర్తిగా మారిపోతాయనే చెప్పొచ్చు. మరి ఏం జరుగుతుందో చూడాలి మరి. ఇక అక్కినేని నాగార్జున ఇటీవలే నా స్వామి రంగా మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక మరోసారి ధనుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి ఏ రేంజ్ విజయాన్ని సాధిస్తాడో చూడాలి మరి.