అయోధ్య ఆహ్వానం అందిన వెళ్లలేకపోతున్న మోహన్ బాబు.. కారణం ఇదే..

ఎన్నో దశాబ్దాల నాటి హిందువుల నమ్మకం కల అయినటువంటి అయోధ్య రామ మందిరం ఏర్పాట్లు ఇటీవల పూర్తయిన సంగతి తెలిసిందే. ఈనెల 22న అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ట అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. ఈ వేడుకను కనులారా చూడడం కోసం ప్రతి ఒక్కరు ఎంతో ఆత్రుతగా వేచి చూస్తున్నారు. ఇక అయోధ్య రామ మందిరం ఏర్పాటు కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే రామమందిరం ట్రస్ట్ వారు ఎంతో మంది సీనియర్ సెలబ్రిటీలకు, రాజకీయ నాయకులకు, వ్యాపారవేత్తలకు స్వయంగా ఆహ్వాన పత్రికను అందజేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్, చిరంజీవి, ప్రభాస్, రామ్ చరణ్ లాంటి సినీ ప్ర‌ముఖులంద‌రికి అయోధ్య నుంచి ఆహ్వానం అందింది. అయితే మోహన్ బాబుకు ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందించారా.. లేదా.. అనే సందేహాలు ఎంతోమందిలో కలిగాయి. ఇక తాజాగా ఈ విషయంపై స్పందించిన మోహన్ బాబు తనకు కూడా అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానందిందని వివరించారు. మోహన్ బాబు మాట్లాడుతూ తనతో పాటు తన కుటుంబానికి కూడా ప్రత్యేక సెక్యూరిటీ కూడా కల్పిస్తామని వారు చెప్పారట‌.

కానీ మేమే భయపడి ఆలయ ప్రారంభోత్సవానికి వెళ్లడం లేదని మోహన్ బాబు వివరించాడు. ఇక అయోధ్య వెళ్ళకపోయినా ఇక్కడ దైవ సన్నిధిలో ఈనెల 14 నుంచి 22 వరకు ఎన్నో పూజా కార్యక్రమాలను చేస్తున్నాం అంటూ చెప్పుకొచ్చాడు మోహన్ బాబు. ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మోహన్ బాబు అయోధ్య ప్రారంభోత్సవానికి వెళ్లడానికి అంతలా భయపెడుతున్న విషయం ఏంటి అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్‌లు.