వేణు స్వామి పై ఫైర్ అయిన ప్రభాస్ పెద్దమ్మ.. సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..

జ్యోతిష్యుడు వేణు స్వామికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సినీ సెలబ్రిటీల, రాజకీయ నాయకుల జ్యోతిష్యాలయం చెబుతూ సోషల్ మీడియా ద్వారా భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈయన.. చెప్పే జాతకాలు చాలా వరకు నిజమైన.. కొన్ని అబద్ధాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ ఈయన పేరు వినిపిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన నటీనటుల జాతకాలు వారిచేత, పూజ చేయించడం.. ఇలా సినీ లవర్స్ ఎక్కువగా ఈయనను ఫాలో అవుతూ.. వేణుస్వామి చేసే కామెంట్స్ ను షేర్ చేస్తూ ఉంటారు.

ఇటీవల ప్రభాస్ పెళ్లి పై, అలాగే ఆయన ఆరోగ్యం పై వేణు స్వామి చేసిన సంచలన కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. దీనిపై ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు. ఇక తాజాగా కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి దీనిపై ఘాటుగా స్పందించింది. కృష్ణంరాజు మరణం తర్వాత పెద్దగా బయట కనిపించని ఆమె.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కృష్ణంరాజు గారి మీద తనకు ఉన్న అభిమానాన్ని, ప్రేమను వివరించింది. ప్రభాస్ పై వేణు స్వామి చేస్తున్న కామెంట్స్ పై ఫైర్ అయ్యింది. ప్రభాస్ జాతకం పై ఆయన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు.. అసలు ప్రభాస్ జాతకం వాళ్ళ అమ్మ దగ్గర మాత్రమే ఉంది.

ఇప్పటివరకు మేము కూడా దానిని తీసుకోలేదు.. మరి ప్రభాస్ జాతకం అతని దగ్గరకు ఎలా వెళ్తుంది.. అంటూ ప్ర‌శ్నించింది. ప్రభాస్ ఆరోగ్య బాలేదని, పెళ్లి విషయంపై అతను చేసిన కామెంట్స్ చాలా ఇబ్బందిగా ఉంటున్నాయి. అయితే కృష్ణంరాజు గారు ఉన్నప్పుడు పిచుక పైన బ్రహ్మాస్త్రం ఏంటి లే అని ఇలాంటి వారందరినీ వదిలేసేవారు. మేము కూడా ఇప్పుడు అదే ఫాలో అవుతున్నాము. ఇలాంటివన్నీ పట్టించుకోవడం మానేస్తున్నాం. ఇక ప్రభాస్ మా అందరితో ఎంతో ఆప్యాయంగా ఉంటాడు. తనకు చెల్లెలు అంటే చాలా ఇష్టం అంటూ వివరించింది. ప్రస్తుతం శ్యామలాదేవి.. వేణు స్వామి పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.