మెగాస్టార్ ” విశ్వంభర ” మూవీలో ఆ స్టార్ హీరోయిన్.. పక్కా హిట్ అంటున్న ఫ్యాన్స్..!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం హీరోగా నటిస్తున్న మూవీ ” విశ్వంభర “. ఈ సినిమాపై మెగాస్టార్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకున్నాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిషను ఫైనల్ చేసినట్లు గతంలో ఎన్నో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

అయితే ఈ మూవీలో నటించే హీరోయిన్ పై కొత్తగా మరో రూమర్ వినిపిస్తుంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్గా కాజల్ అగర్వాల్ నటించబోతున్నట్లు సమాచారం. ఇవ్వార్తని ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించకపోయిన సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ వైరల్ అవుతుంది. అంతేకాకుండా కాజల్ అగర్వాల్, మెగాస్టార్ చిరంజీవి సరసన నటిస్తే బొమ్మ బ్లాక్ బస్టర్ అంటున్నారు ఫ్యాన్స్.

ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి దర్శకుడు వశిష్ఠ పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమాలో మెగాస్టార్ ను ఎలా చూడాలి అనుకుంటున్నారో.. ఆయన పాత్ర అలానే ఉంటుందని.. దానితో పాటుగా అద్భుతమైన ఫాంటసీ డ్రామా కూడా ఉంటుందని తెలియజేశారు. ఇక ఈ భారీ ప్రాజెక్ట్ కి కీరవాణి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతుంది.