‘ సలార్ 2 ‘ లో అఖిల్.. క్లారిటీ ఇచ్చేసిన ప్రశాంత్ నీల్ వైఫ్..

తాజాగా పాన్ ఇండియ‌న్‌ స్టార్ హీరో ప్రభాస్ నటించిన సలార్‌ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర రికార్డు కలెక్షన్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు కేజీఎఫ్ సిరీస్‌ల‌ దర్శకుడు ప్రశాంత్ నీల్‌ దర్శకత్వం వహించారు. శృతిహాసన్ హీరోయిన్గా, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, శ్రేయ రెడ్డి కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకు సీక్వెల్ గా పార్ట్ కూడా రాబోతుందని క్లైమాక్స్ లో చూపించిన సంగతి తెలిసిందే. ఇక ఈ పార్ట్ 2 ను సలార్ శౌర్యంగా పర్వం అంటూ పేరును రివిల్ చేశారు మేకర్స్. మొదటి పార్ట్ లో ఎన్నో ప్రశ్నలు మిగిల్చినా.. వీటన్నింటికీ రెండో పార్ట్‌లో సమాధానం ఇవ్వబోతున్నాడు ప్రశాంత్‌.

ఇక ఇటీవల ఈ మూవీ టీం సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ లో యంగ్ హీరో అఖిల్ అక్కినేని కూడా కనిపించడంతో సలార్ పార్ట్ 2 లో అఖిల్ అక్కినేని నటించబోతున్నాడు అంటూ ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి. పార్ట్ 2లో దేవ తముడుగా అఖిల్ ఉంటాడు అంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై తాజాగా ప్రశాంత్ నీల్‌ భార్య లిఖిత రెడ్డి క్లారిటీ ఇచ్చేసింది. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ తో ఇంట్రాక్ట్ అయిన నేపథ్యంలో ఎన్నో ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పింది.

ఈ ఈవెంట్‌కి అఖిల్ ఎందుకు వచ్చారు..? ఆయన సలార్ 2 లో నటిస్తున్నాడా..? అంటూ ఓ అభిమాని ప్రశ్నించగా దానిపై స్పందిస్తూ ఆమె క్లారిటీ ఇచ్చింది. సలార్ 2 లో అఖిల్ ఉన్నాడు అనే వార్తలు ఎలాంటి నిజం లేదని.. అవన్నీ కేవలం పుకార్లే అంటూ కన్ఫామ్ చేసేసింది. ఇక ప్రస్తుతం హొంబలే ఫిల్మ్‌స్ బ్యానర్ పై అఖిల్ ఓ సినిమాను కన్ఫామ్ చేశారు. అందుకే ఆ బ్యానర్ లోనే రూపొందిన సలార్ సెలబ్రేషన్స్‌కు ఆయనకు ఆహ్వానం అందింది. దీంతో ఆయన సలార్ సెలబ్రేషన్స్ కు వచ్చాడు అంటూ చెప్పుకొచ్చింది. ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.