నాగచైత‌న్య ముంచేశాడు.. నాగార్జున సినిమాతో లాభాలిస్తున్నాడు.. బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ నిర్మాత..

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలను నిర్మిస్తూ వృద్ధిలోకి వస్తున్న నిర్మాతలలో శ్రీనివాస్ చిట్టూరి ఒకరు. యూటర్న్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో కెరీర్‌ ప్రారంభించిన ఈయన ఈ సినిమాతో హిట్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత సిటిమార్, ది వారియర్, కస్టడీ, స్కంద సినిమాలను నిర్మించిన శ్రీనివాస్ కు ఈ సినిమాలన్నీ భారీ షాక్ ఇచ్చాయి. అయితే ఇటీవల నాగార్జున నటించిన నా సామిరంగా మూవీ తో ఈయనకు భారీ లాభాలు వచ్చినట్లు తెలుస్తోంది. నా సామి రంగ మూవీ ఇప్పటికే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ రీచ్ అయిపోయింది.

ఇక నాగచైతన్య కస్టడ్డి సినిమాతో నిర్మాతకు భారీ నష్టాలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా నాగార్జున మాత్రం నా సామరంగ సినిమాతో ఈయనకు భారీ లాభాలను అందిస్తున్నాడు. చాలా సంవత్సరాల తర్వాత ఈ ప్రొడ్యూసర్ కు ఒక సక్సెస్ అందింది. సినీ అభిమానులు కూడా ఆయన పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈయ‌న తర్వాత ప్రాజెక్టులపై ఇంకా ఎటువంటి క్లారిటీ రాలేదు. అయితే నా సామి రంగ మూవీకి ఇప్పటికే రూ.20.54 కోట్ల షేర్ వసూలు వచ్చాయి. ఇక వారాంతరానికి వచ్చేసరికి ఈ సినిమా కలెక్షన్లు రూ.11 లక్షలు వచ్చాయి.

వైజాగ్, సీడెడ్ లో ఈ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను కొల్లగొడుతుంది. ప్రపంచవ్యాప్తంగా నా స్వామి రంగా సినిమాకు ఇప్పటికే రూ.41.3 కోట్ల క్రాస్ అందింది. ఫుల్ రన్ లో ఈ సినిమా రూ.50 కోట్ల మార్క్‌ దాటే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. అయితే పరిమిత బడ్జెట్ తో కంటెంట్ ఉన్న సినిమాలు తీయడంతో శ్రీనివాస్ చిట్టూరికి ఈ సక్సెస్ అందిందని.. ఇకపై ఇలాంటి సినిమాలనే నిర్మిస్తే ఆయన సక్సెస్ ల బాటలో ప్రయాణించే అవకాశం ఉందని నెటిజన్లు కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు.