ప్రభాస్ కు చిరంజీవి అంటే ఇష్టం ఉండడానికి కారణం అదేనా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్ హీరోలుగా క్రేజ్‌ సంపాదించుకున్న ఎంతోమంది యంగ్ హీరోలకు.. గతంలో హీరోలుగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సీనియర్ హీరోలు అభిమాన హీరోలుగా ఉంటూ ఉంటారు. అలా ఇప్పుడు ఉన్న యంగ్ హీరోలలో ఎక్కువగా చిరంజీవి, బాలకృష్ణను అభిమానించే హీరోలు కనిపిస్తూ ఉంటారు. వారు చిన్నప్పటి నుంచి ఈ హీరోల సినిమాలను చూస్తూ పెరగడంతో వారిని ఇండస్ట్రీలోకి వచ్చాక కూడా అదే స్థాయిలో అభిమానిస్తూ ఉంటారు. ఇక చిరంజీవి అంటే ఇప్పుడు ఉన్న హీరోల్లో చాలామందికి అభిమానం ఉంటుంది.

ఆయన సాధించిన ఘనతలు అలాంటివి. చిరంజీవి చేసిన సినిమాలు ప్రతి సినిమా మినిమం గ్యారెంటీ కంటెంట్ ఉంటుంది. సినిమా సినిమాకు వేరియేషన్స్ చూపించడమే కాకుండా ప్రతి సినిమాల్లో డిఫరెంట్ స్టోరీ ని ఎంచుకుంటూ చిరంజీవి సక్సెస్ అందుకుంటున్నాడు. అందుకే 40 సంవత్సరాలు పాటు మెగాస్టార్ తన సత్తా ఏంటో చూపిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. ఇక అసలు విషయానికి వస్తే పాన్‌ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ కూడా చిరంజీవికి వీరాభిమాని అన్న సంగతి చాలా వ‌ర‌కు తెలియదు.

పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు హీరో అయినా.. కృష్ణంరాజు కాకుండా తనకి బాగా నచ్చిన హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది చిరంజీవి అంటూ పలు ఇంటర్వ్యూలో ప్ర‌భాస్ వివరించాడు. అయితే ప్రభాస్ కు చిరంజీవి డ్యాన్స్ అంటే చాలా ఇష్టమట. అలా డ్యాన్స్ చేసేవారు అంటే ప్రభాస్‌కు నచ్చుతారని.. చిరంజీవి నచ్చడానికి కూడా అది ఓ ప్రధాన కారణం అంటూ తెలుస్తుంది. అయితే చిరంజీవి నటనలో వేరియేషన్స్ కూడా బాగా ప్రభాస్‌కు నచ్చుతాయని వార్తలు వినిపించాయి.

స్వయంకృషి, ఆపద్బాంధవుడు, గ్యాంగ్ లీడర్ లాంటి వేరియేషన్ ఉన్న సినిమాల్లో చిరంజీవి నటించిన కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అలా తను కూడా చిరంజీవిలా ఓ గొప్ప హీరోగా ఎదగాలని ఉద్దేశంతో ప్రభాస్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినట్లు గ‌తంలో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఉన్న హీరోల్లో చిరంజీవికి ఎక్కువగా నచ్చే హీరో కూడా ప్రభాసే కావడం విశేషం. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవ్వడంతో తమ అభిమాన హీరో చేత అభిమానించబడటం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఈ విషయంలో ప్రభాస్ చాలా లక్కీ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.