హీరోయిన్ శ్రియకు సిస్టర్ ఉంద‌ని తెలుసా.. చూడ‌గానే భలే ముద్దొస్తుందే..

టాలీవుడ్ సీనియర్ స్టార్ బ్యూటీ శ్రియ శరణ్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇప్పటికి పలు సినిమాల్లో హీరోయిన్గా రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మ అవసరమైనప్పుడు సపోర్టింగ్ రోల్ లో కూడా నటిస్తు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే పర్సనల్ విషయానికి శ్రియ‌కు ఓ బ్రదర్ ఉన్నాడని చాలామందికి తెలుసు కానీ ఈమెకు ఓ సిస్టర్ కూడా ఉంది అనే విషయం చాలామందికి తెలియదు. అయితే ఇప్పుడు ఆమె పోలికలతో చూడడానికి శ్రియాలనే ఉంటూ చూడగానే ముద్దొస్తూ ఓ అమ్మాయి కనిపిస్తుంది.

 

ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. శ్రీయ తాజాగా తిరుమల వెంకన్నను దర్శించుకోవడానికి కుటుంబ సమేతంగా అక్కడకు వెళ్లారు. శ్రీయతో పాటు ఆమె తల్లి కూడా వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఇక‌ వారితో పాటు మరో అమ్మాయి కూడా కనిపించింది. ఆమె చూడడానికి శ్రియాలా అనిపిస్తుంది. స్మైల్ అండ్ ఫేస్ చూస్తే శ్రియ సిస్టర్ లా ఉంది అనే సందేహాలు అంద‌రిలోను వ్యక్తం అవుతున్నాయి.

అయితే శ్రియకి సొంత సిస్టర్ అవుతుందా.. లేదా సిబ్లింగ్ అవుతుందా.. అనేది తెలియదు. ఇక‌ అచ్చం ఆమెలాగే ఉన్న సిస్టర్ ను ఇన్నాళ్ళ వరకు కెమెరా ముందుకు తీసుకురావకుండా.. సడన్గా కెమెరా ముందుకు తీసుకురావడంతో ప్రస్తుతం ఈమెను ఇండస్ట్రీకి పరిచయం చేసేందుకే శ్రీయ కెమెరా ముందుకు తీసుకువచ్చిందని క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.