చిరంజీవి శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమా డైరెక్టర్ మారడానికి కారణం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

సినీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి కష్టంతో స్టార్ హీరోగా మారిన వారిలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. ఈయన ఎంతోమందికి ఇన్స్పిరేషన్ గా నిలిచారు. పట్టుదల.. కసి ఉంటే ఎలాంటి వారైనా తమ గోల్స్ రీచ్ అవ్వచ్చు అని చెప్పడానికి చిరంజీవి బెస్ట్ ఉదాహరణ. ఏడుపదుల వయసు వచ్చిన ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీగా ఫైట్లు, డ్యాన్సులు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న చిరంజీవి షూటింగ్ టైంలో కూడా అందరికంటే ముందే ఉంటారు. ఈ రేంజ్ లో డెడికేషన్ తో పనిచేశాడు కాబట్టి చిరంజీవి అంత సక్సెస్ ను చూడగలిగారు.

ఇక గతంలో హిందీలో సూపర్ సక్సెస్ అయిన మున్నాభాయ్ ఎంబిబిఎస్ సినిమాను తెలుగులో చిరంజీవి హీరోగా శంకర్ దాదా ఎంబిబిఎస్ గా తెర‌కెక్కించిన సంగతి తెలిసిందే. నిజానికి హిందీలో ఈ సినిమాను రాజ్‌కుమార్ హీరోని దర్శకత్వం వహించగా.. సంజయ్ దత్ హీరోగా నటించాడు. ఈ సినిమా అక్కడ సూపర్ సక్సెస్ అందుకుంది. దీంతో చిరంజీవి రీమిక్స్ రేట్స్ నొంతం చేసుక‌ని ముందుగా ఈ సినిమాను గ‌తంలో చిరుకి మాస్టర్, డాడీ లాంటి రెండు బ్లాక్ బ‌స్టర్ హిట్లు అందించిన డైరెక్టర్ సురేష్ కృష్ణకు ఈ ప్రాజెక్టును అందించాడు.

ఇక ఈ స్టోరీలో కొన్ని మార్పులు చేర్పులు చేసి చిరంజీవికి తగ్గట్టుగా కథను మార్చి ఎక్ష్ప్లైన్ చేయగా ఆయనకు అది నచ్చలేదట. ఇక‌ సురేష్ కృష్ణను సినిమా నుంచి తప్పించి బావగారు బాగున్నారా లాంటి సినిమాతో సక్సెస్ అందించిన జయంత్‌ సి పరాంజికి డైరెక్టర్గా అవకాశం ఇచ్చారు. ఇక జయంత్ ఈ సినిమాతో తనదైన రీతిలో మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించి చిరంజీవికి సక్సెస్ అందించాడు. ఇలా చిరంజీవి శంకర్ దాదా సినిమాకు మొదట అనుకున్న డైరెక్టర్ ను మార్చేయాల్సి వచ్చింది.