రాజమౌళి – మహేష్ కాంబోపై నరేష్ ఇంట్ర‌స్టింగ్‌ కామెంట్స్ వైర‌ల్‌..

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడు నరేష్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మొదట్లో హీరోగా తర్వాత సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్న నరేష్.. ఇటీవల తన సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 50 ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో సందడి చేశాడు నరేష్. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈయన ప్రస్తుతం వ‌రుస సినిమాల‌లో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ తన జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకున్నాడు.

ఆయన చిన్నప్పుడు లేవగానే అమ్మ విజయనిర్మల, తండ్రి కృష్ణ మేకప్ రూమ్లను చూసేవాడని.. వారికోసం వచ్చే జనాన్ని చూసి నాలో నటనపై ఆసక్తి పెరిగిందని.. నేను ఇండస్ట్రీ వైపు వచ్చింది కూడా అందుకే అంటూ కామెంట్లు చేశాడు. ఇటీవల కాలంలో న‌టుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 10 సంవత్సరాలు కొనసాగడం చాలా కష్టంగా మారింది. అయితే 50 సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో నేను ఉన్నాను అంటే అందుకు కారణం కేవలం ఆడియన్స్ నన్ను ఆదరించడమే.. దానివల్లే నేను ఈ స్థాయిలో ఉన్నానంటూ వివరించాడు న‌రేష్‌.

ఇలా తన కెరీర్ గురించి ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నా నరేష్.. మ‌హేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో తెర‌కెక్క‌నున్న సినిమా గురించి ఆశ‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు. మహేష్ బాబుకు.. మాస్, క్లాస్ అని తేడా లేకుండా అన్ని వర్గాల్లో ఆదరణ ఉంది. రాజమౌళికి ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ ఉంది. వీరిద్దరి కాంబోలో వచ్చే సినిమా అంటే ఆ సినిమా మరో లెవెల్ లో ఉంటుంది అంటూ నరేష్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.