దళపతి విజయ్ కాపురంలో చిచ్చు పెట్టిన ఆ స్టార్ హీరోయిన్.. టాప్ సీక్రెట్ రివిల్..

కొలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతికి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. కాగా తాజాగా విజయకు సంబంధించిన ఓ న్యూస్‌ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. విజ‌య్ ఓ స్టార్ బ్యూటీకి డైమండ్ నెక్లెస్ ఇచ్చారని ఈ కారణంగానే విజయ్ తన భార్య మ‌ధ్య‌న గొడవలు మొదలయ్యాయి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు త్రిష. ఇప్పటికీ విజయ్ – త్రిష కాంబోలో ఎన్నో సినిమాలు వ‌చ్చి బ్లాక్ బ‌స్టర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. మొదట్లో వీరిద్దరూ 2004లో గిల్లి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. తర్వాత మూడు సినిమాల్లో వీరు కలిసి నటించారు.

అయితే మళ్ళీ 15 ఏళ్ల గ్యాప్ తర్వాత ఈ కాంబో రిపీట్ అయి బ్లాక్ బస్టర్ అందుకుంది. కాగా ఫిలిమ్‌ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ కలిసి రెండు సినిమాల కంటే ఎక్కువగా నటిస్తే వీరిపై రూమర్స్ కామన్ గానే వస్తూ ఉంటాయి. ఇలా విజయ్, త్రిషపై చాలా పుకార్లు వినిపించాయి. త్రిష కార‌ణంగా వ‌జ‌య్‌ కుటుంబంలో మనస్పర్ధలు తలుకుతాయని అతని భార్య సంగీత ఆయనకు దూరంగా ఉంటుందంటూ తెలుస్తుంది. చాలా కాలం సాగిన వీరి గొడవ కొంతకాలానికి సర్దుమనిగిందట. తాజాగా ఈ వివాదం ఓ జర్నలిస్టు వల్ల మళ్ళీ రాజుకుంది. కోలీవుడ్ ప్రముఖ ఫిలిమ్‌ జర్నలిస్ట్ అయిన పాండియన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సందడి చేశాడు.

ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విజయ్, త్రిష గురించి ఒక సంచలన రహస్యాన్ని బయట పెట్టాడు. గతంలో త్రిష ఇంటిపై ఐటి దాడులు నిర్వహించారని.. ఐటీ దాడుల్లో త్రిష ఇంట్లో కోటి రూపాయలు విలువ చేసే డైమండ్ నెక్లెస్ బయటపడిందని.. అయితే దాని గురించి ఆమెను ఐటి అధికారులు ప్రశ్నించగా.. నెక్లెస్ యాక్టర్ విజయ్ తనకు బహుమతిగా ఇచ్చాడంటూ చెప్పినట్లు పాండియన్ ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. దీంతో మరోసారి ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. ఇది అక్క‌డ‌ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. వీరిద్దరి మధ్య ఏదో ఉంది.. అందుకే అంత ఖరీదైన గిఫ్ట్లను విజయ్ త్రిష కు అందిస్తున్నాడు అంటూ గుసగుసలు మొదలయ్యాయి.