తారక్ ” దేవర ” మూవీలో సర్ప్రైసింగ్ ట్విస్ట్ ఇదే..!

యంగ్ హీరో తారక్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” దేవర “. జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాపై తారక్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమాలోని ఇంటర్వెల్ సీక్వెల్స్ లో ఎన్టీఆర్ క్యారెక్టర్ గురించి ఓ సర్ప్రైజ్ ట్విస్ట్ రివిల్ అయినట్లు తెలుస్తుంది. ఈ ట్విస్ట్ సినిమా మొత్తానికే హైలైట్ గా నిలవనుందట. ఈ సీక్వెల్స్ లో ఎన్టీఆర్ కూడా పూర్తిగా రఫ్ అండ్ రగ్గుడ్ లుక్ లో కనిపించనున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాను దాదాపు రూ. 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నాడు కొరటాల శివ.

ఏదేమైనా కొరటాల ఈ దేవర కథ కోసం చాలా నెలలు కష్టపడ్డాడు. ఇక ఇందుకు తగ్గ ఫలితం దక్కుతుందో లేదో చూడాలి మరి. ఇక ఈ సినిమా తెలుగుతోపాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో కూడా రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే వీరి కాంబినేషన్లో వచ్చిన ” జనతా గ్యారేజ్ ” ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ సినిమాతో ఇంకే రేంజ్ సెన్సేషన్ సృష్టిస్తారో చూడాలి మరి.