మరోసారి సలారోడి సెన్సేషన్… తగ్గేదేలే అంటున్న డార్లింగ్ ఫ్యాన్స్..!

రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా నటించిన మూవీ ” సలార్ “. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టడం జరిగింది.

అయితే ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫారం అయినా నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా విడుదలైంది. ఇక ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. ఇక ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన కొన్ని క్లిప్స్ అండ్ ఫొటోస్ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ షేర్ చేస్తూ హడావిడి చేస్తున్నారు. ఇక దీంతో ఈ సినిమా మరోసారి ఓ సెన్సేషన్ సృష్టించిందని చెప్పొచ్చు.

ఇక ఈ సినిమాని రెండు పాట్లుగా విభజించిన సంగతి తెలిసిందే. మొదటి పార్ట్ తోనే ఇంతటి విజయం సాధించిన ఈ మూవీ రెండో పార్ట్ తో ఏ విధమైన విజయం సాధిస్తుందో చూడాలి మరి. ఇక ఆ రెండో పార్ట్ లో ప్రభాస్ లుక్ అండ్ డైలాగ్స్ కనుక ప్రేక్షకులను ఆకట్టుకోగలిగితే ఈ రెండో పార్ట్ బాహుబలి నే క్రాస్ చేస్తుందని చెప్పొచ్చు. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.