” హనుమాన్ ” మూవీకి ఏకంగా అన్ని లక్షలకు పైగా టికెట్లు బుకింగ్.. ఆశ్చర్యపోతున్న ఫ్యాన్స్..!

యంగ్ అండ్‌ టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ” హనుమాన్ “. చిన్న సినిమాగా రిలీజ్ అయి భారీ స్థాయిలో కలెక్షన్స్ను రాబడుతుంది హనుమాన్. మొదటి రోజు నుంచి కూడా హౌస్ ఫుల్ తో సినిమా పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

ప్రముఖ టికెటింగ్ యాప్ అయినా బుక్ మై షో లో ఇప్పటివరకు 30 లక్షల కి పైగా హనుమాన్ మూవీ టికెట్ల బుక్ అయ్యాయి. ఇది పెద్ద సెన్సేషన్ అనే చెప్పొచ్చు. ఈరోజు దాదాపు అన్ని ప్రాంతాలలో కూడా మంచి వసూళ్లను రాబట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా లాంగ్ రన్ లో కూడా మరిన్ని వసూళ్లు రాబట్టడం ఖాయం.

అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్‌, వినయ్ రాయ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు వహించారు. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమాకి సీక్వెల్ ఉండబోతున్న సంగతి తెలిసిందే. మొదటి పార్ట్ ఈ విధంగా దూసుకుపోతుంటే రెండో పార్ట్ గురించి ఇంకా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.