” ఆలియా సపోర్ట్ తోనే నేను ఆ సీన్స్ చేశాను “.. రణబీర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్గా తాజాగా తెరకెక్కిన మూవీ ” యానిమల్ “. రిలీజ్ అనంతరం మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది ఈ మూవీ. అయితే అన్ని ప్రాంతాల ప్రేక్షకులు అనిమల్ మూవీని మాత్రం చాలా బాగా ఆదరించారు.

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలోని ఇంటిమేట్ అండ్ హింసాత్మక సన్నివేశాలలో నటించడంపై తాజాగా హీరో రణబీర్ కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రణబీర్ మాట్లాడుతూ..” యానిమల్ సినిమాలోని ఇంటిమేట్ అండ్ హింసాత్మక సన్నివేశాలలో నటించడానికి నేను మొదట చాలా అసౌకర్యంగా ఫీల్ అయ్యాను.

ముఖ్యంగా కెరీర్ పరంగా నాకు చెడ్డ పేరు వస్తుందని బాధపడ్డాను. కానీ నా భార్య ఆలియా భట్ మాత్రం చాలా ఎంకరేజ్ చేసింది. ఆమె ప్రోత్సాహంతోనే నేను ఇంటిమేట్ సన్నివేశాలలో నటించాను ” అంటూ చెప్పుకొచ్చాడు రణబీర్. ప్రస్తుతం ఈయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.