అయోధ్యకి వెళ్లే దారిలో అభిమానులని పలకరించిన చిరు, చెర్రీ.. ఫొటోస్ వైరల్..!

అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే రామ మందిరం ప్రతిష్ట నేడు జరగనుంది. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. అయోధ్యలో జరిగే ఈ చారిత్రక కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి మరియు రామ్ చరణ్ లు కూడా హాజరయ్యారు. అయోధ్యకు ప్రయాణం ప్రారంభించే ముందు చిరు మరియు చెర్రీ భారీగా తరలివచ్చిన అభిమానులని కలిశారు.

స్టార్ నటులు ఇద్దరూ తమ అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు కూడా. అనంతరం అభిమానులు చిరంజీవి మరియు రామ్ చరణ్ కు శ్రీ రాముని ఫోటోను అందజేశారు. అలాగే కొంతమంది చిరంజీవి బ్లడ్ బ్యాంకులో రక్తదానం కూడా చేశారు.

ఇక చిరంజీవి మరియు రామ్చరణ్ లు ఇద్దరూ అభిమానులని పలకరిస్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే…” సాధారణంగా ఏ హీరో అయినా తమ అభిమానులని అస్సలు పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ వీళ్ళిద్దరూ తమకోసం వచ్చిన అభిమానులని పలకరించడం గొప్ప విషయం ” అంటూ పొగిడేస్తున్నారు ప్రేక్షకులు.