రాజమౌళి సినిమా కోసం దిల్ రాజు కూడా కసరక్తులు మొదలు పెట్టాడా..?

స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రాజమౌళి కేఎల్ నారాయణతో చేస్తున్నారు. కేఎల్ నారాయణ తో చేయబోయే సినిమాలో భాగస్వామ్యం కోసం దిల్ రాజు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని సమాచారం.

అంతేకాకుండా ఈ సినిమా కోసం దిల్ రాజు భారీ కసరత్తులు చేస్తున్నాడట. ఇలాంటి ప్రెస్టీజ్ ప్రాజెక్టులో భాగస్వామ్యంగా దిల్ రాజు చేరితే ఈ ప్రాజెక్టు పై మరింత క్రేజ్ పెరుగుతుంది. ఇక ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఓ కీలక పాత్రలో వహిస్తుంది.

ఇక తాజాగా విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా కథ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..” నేను, రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్ కు పెద్ద అభిమానులం. అందుకే ఆయన పుస్తకాల ఆధారంగానే ఈ సినిమా స్క్రిప్ట్ను తయారు చేస్తున్నాము ” అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమా రిలీజ్ అనంతరం ఎంతటి దుమారం రేపుతుందో చూడాలి మరి.