నాగచైతన్య కి థాంక్స్ తెలియజేసిన ప్రశాంత్ వర్మ.. ఎందుకో తెలుసా..!

టాలీవుడ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జ ముఖ్యపాత్రలో అమృత అయ్యర్ హీరోయిన్ గా తెరకెక్కిన ” హనుమాన్ ” బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఇక ఈ సందర్భంలోనే పలువురు సినీ సెలబ్రిటీలు కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్స్ చేస్తున్నారు.

ఇక ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతూ దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాని టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య చూసి ప్రశంసల వర్షం కురిపించారు. బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధించినందుకు ప్రశాంత్ వర్మ కి కంగ్రాట్స్ చెబుతూ.. న్యూ ఎస్ రైటింగ్, కాన్సెప్ట్ లో గూస్ బంప్స్ మూమెంట్స్ ఉన్నాయి.

అంతేకాక నీ యూనివర్స్‌లో నన్ను ఇన్వెస్ట్ చేసేలా చేసావు.. అంటూ చెప్పుకొచ్చాడు. ఇక దీనికి ప్రశాంత్ వర్మ సైతం థాంక్యూ సో మచ్ సార్ అంటూ రిప్లై ఇచ్చాడు. ఇక ప్రస్తుతం వీరిద్దరి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక హనుమాన్ మూవీ లాంగ్ రన్ లో కూడా భారీ వసూళ్లను సాధించేలా కనిపిస్తుంది. మరి ఏం జరుగుద్దో చూడాలి.