అయాన్ నే పక్కకి గెంటి పడేసిన బాడీ గార్డ్స్.. ఫుల్ గా ఏకేస్తున్న ఫ్యాన్స్..!

అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహారెడ్డి ఇంట బాధ్యతలు తీసుకుంటూనే పలు బిజినెస్ రంగాల్లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఓ యాడ్ షూట్ కూడా చేసింది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తన ఫ్యాన్స్ తో అన్ని విషయాలను పంచుకుంటుంది.

అయితే ఇటీవల చిన్న పిల్లల విషయంలో ఓ కీల‌క‌ నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన ప్రమోషన్స్ కూడా చేసింది. ఇక ఈ మేరకు శనివారం నాడు ఎన్ కన్వెన్షన్ లో ఫైర్ పై కార్నివల్ ను నిర్వహించింది. ఈ ఈవెంట్ కు చివరి నిమిషంలో అల్లు అర్జున్ ను తీసుకువచ్చింది.

దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇక అల్లు అర్జున్, స్నేహాల కొడుకు అయాన్ ను బాడీ గార్డులు పక్కకు నెట్టెయ్యబోయారు. అంతలో ఒకతను గుర్తుపట్టి తల్లిదండ్రుల దగ్గరకు పంపించాడు. ఇక ఇది చూసిన ప్రేక్షకులు ఆ బాడీ గార్డ్స్ పై ఫైర్ అవుతున్నారు. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.