అల్లు స్నేహారెడ్డికి ఫ్యాన్స్ అయిపోతున్న నేటిజన్స్ ఆ వాయిస్, అందం అదుర్స్ అంటూ..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహ రెడ్డికి ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈమె ఇండస్ట్రీలో ఎటువంటి సినిమాల్లో నటించకపోయిన.. ఓ మిడిల్ రేంజ్ హీరోయిన్‌కు ఉండేంత పాపులారిటీ ద‌క్కించుకుంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా చాలామంది అభిమానిస్తూ ఉంటారు. అయితే ఇప్పటివరకు ఎటువంటి సినిమాల్లోనూ నటించని స్నేహ రెడ్డి ఫిట్నెస్ పై ఆమె తీసుకుంటున్న కేర్‌కు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పాపుల‌ర్ అయ్యింది.

తర్వాత పలు ఫోటో షూట్ ల ద్వారా సోషల్ మీడియాలో హైలెట్గా నిలిచిన స్నేహ రెడ్డి.. ఇటీవలే మొట్టమొదటిసారి యాడ్ షూట్ కోసం కెమెరా ముందుకు వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంది. తన అందంతో అభిమానులను సొంతం చేసుకుంటుంది. ఈమె చూడడానికి ఎంతో అందంగా హైట్‌గా కనిపిస్తూ ఆకట్టుకుంటుంది. దీంతో మీరు సినిమాలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వచ్చు కదా అంటూ ప్రేక్షకులంతా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆమె మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అల్లు అర్జున్ అభిమానులు కూడా ఇప్పటివరకు స్నేహ రెడ్డి వాయిస్ విన్నదే లేదు. అయితే మొదటిసారి ఆమె మీడియాతో ముచ్చటించింది. ఆ సందర్భంలో ఆమె మీడియాతో మాట్లాడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో మీ వాయిస్ కూడా ఎంతో స్వీట్ గా ఉందని.. ఇక నటన టాలెంట్ ఉంటే కచ్చితంగా ఇండ‌స్ట్రీలో రాణిస్తారు అంటూ చాలామంది నీటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆమె వాయిస్, అందం అదుర్స్ అంటూ ఆమెకు ఫిదా అవుతున్నారు. ఈ వీడియోను నెట్టింట‌ షేర్ చేస్తూ తెగ వైరల్ చేస్తున్నారు.