ఇంటికి వచ్చిన లక్ష్మి దేవిని ..వెనక్కి పంపించేసిన చిరంజీవి.. ఏంటి బాసూ ఇది..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే కొన్ని కొన్ని సార్లు తప్పులు చేయక తప్పదు.. తెలుసుకొని కొన్నిసార్లు తప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తే.. కొన్నిసార్లు తెలియకుండా చేస్తారు . అయితే తెలిసి చేశాడో తెలియక చేశాడో తెలియదు కానీ మెగాస్టార్ చిరంజీవి ఒక మంచి సినిమాను వదులుకొని తన కెరియర్లో పెద్ద తప్పే చేశాడు అంటున్నారు మెగా అభిమానులు.

డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో నటించాలి అంటే అదృష్టం ఉండాలి అంటూ అప్పట్లో జనాలు చెప్పుకొచ్చేవారు . అంతేకాదు డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఒక్క సినిమాలోనైనా నటిస్తే చాలు అంటూ చాలామంది స్టార్ హీరోలు ఓపెన్ గానే తమ మనసులోని మాటను చెప్పుకొచ్చారు. అలాంటి శంకర్ దర్శకత్వంలో చేసే ఛాన్స్ వచ్చినా సరే చిరంజీవి రిజెక్ట్ చేశాడు . ఆ సినిమా మరేదో కాదు జెంటిల్మెన్ .

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో కోలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . అర్జున్ సర్జా నటించిన జెంటిల్మెన్ సినిమాలో ముందుగా శంకర్ చిరంజీవి ని అనుకున్నారట . ఆయనకు కథ కూడా వివరించారట. కానీ అప్పటికే ఆయన వేరే సినిమా షూట్స్ లో బిజీగా ఉండడంతో ఈ రోల్ ని మిస్ చేసుకున్నారట . ఈరోల్ చేసుంటే చిరంజీవి కెరియర్ ఇంకా బాగుండేది అని చెప్పడంలో సందేహం లేదు . ప్రెసెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది..!!