రూ.500 కోట్ల ‘ మహాభారతం ‘ లో.. బంపర్ ఆఫర్ కొట్టేసిన దేవర బ్యూటీ..

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం కంగువ‌ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత సూర్య మరో ప్రాజెక్టు గురించి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది. బాలీవుడ్లో మహాభారతం ఆధారంగా రాకేష్ ఓం, ప్రకాష్ మెహ్రా దర్శకత్వంలో ఓ సినిమా తెర‌కెక్క‌నుంది.

ఈ సినిమాలో సూర్య బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ‌నున్నాడ‌ని సమాచారం. ఇక ఈ మూవీలో డిఫరెంట్ రోల్లో ఆయన కనిపించబోతున్నాడట. ఇక ఈ సినిమాకు హీరోయిన్గా దేవర బ్యూటీ జ‌న్వీ క‌పూర్‌ను సెలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు జాన్వి అయితేనే పర్ఫెక్ట్ గా ఉంటుందని దర్శకులు భావిస్తున్నారట.

ఇక రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ప్ర‌స్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో జాన్వి బంపర్ ఆఫర్ కొట్టేసిందే.. తంతే గారెలు బుట్టలు పడడం అంటే ఇదేనేమో అంటూ.. దేవరా సినిమా ఇంకా రిలీజ్ అయినా కాలేదు మరో పాన్ ఇండియా మూవీ ఛాన్స్ కొట్టేసింది.. జాన్వికి మంచి టైం నడుస్తున్నట్లు ఉంది అంటూ.. కామెంట్ చేస్తున్నారు నెట్టిజ‌న్లు. అయితే దీనిపై ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు.