డేంజరస్ ప్లేస్ లో భారీ రిస్క్ చేస్తున్న చెర్రీ… టెన్షన్ పడుతున్న ఫ్యాన్స్..!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. చెర్రీ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్గా మావెరివ్ దర్శకుడు శంకర్ కాంబినేషన్లో తెరకెక్కనున్న భారీ మూవీ ” గేమ్ చేంజర్ “. ఈ సినిమాపై మెగా అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకున్నాయి.

ఇక ఈ సినిమా కోసం చెర్రీ ఇప్పటికే తన మేకవర్ ని చాలాసార్లు మార్పులు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక శంకర్ సినిమాలు అంటే ఎంత న్యాచురల్ గా రియలిస్టిక్ గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి అలా ఇప్పుడు ఓ షూటింగ్ విషయంలో టాక్ బయటకు వచ్చింది.

లేటెస్ట్ గా శంకర్ ఓ కీలక సన్నివేశాన్ని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో షూట్ చేస్తున్నారు. ఆ ప్రయత్నం పలు విష వాయువులతో చాలా ప్రమాదకరమైనది అని అయినా కూడా ఆసీన్ కంప్లీట్ చేసేందుకు చెర్రీ తన ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో ఈ సినిమా కోసం తాను తీసుకున్న రిస్క్ తో తన అభిమానులు ఆందోళనలో పడ్డారు. మరీ చెర్రీ ఇంత రిస్కు తీసుకోవడం అవసరమా అంటున్నారు మరికొందరు.