బిగ్ బ్రేకింగ్: సానీయా మీర్జా కు ఊహించని షాక్.. ఇంకో పెళ్లి చేసుకున్న షోయబ్ మాలిక్..!?

ఇది నిజంగా సానియా మీర్జా అభిమానులకు బిగ్ షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. సానియా మీర్జా భారత టెన్నిస్ స్టార్ ..ఆమె గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ స్టార్ స్టేటస్ సంపాదించుకునింది . ఇండియాకి ఎన్నో మెడల్స్ తెచ్చి పెట్టింది . అలాంటి సానియా మీర్జా పాకిస్తాన్ క్రికెట్ స్టార్ షోయబ్ మాలిక్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీళ్ళకి ఒక బాబు కూడా జన్మించాడు . చాలా హ్యాపీగా అన్యోన్యంగా సాగిపోతున్న వీళ్ళ సంసారంలో గొడవలు మొదలయ్యాయి .

మనస్పర్ధలు కారణంగా వీళ్ళు దూరం దూరంగా ఉంటున్నారు అన్న ప్రచారం ఎక్కువగా జరిగింది . అంతేకాదు వీళ్ళు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ నేషనల్ మీడియాలో వార్తలు కూడా వైరల్ అయ్యాయి. రీసెంట్గా సానియా మీర్జా సోషల్ మీడియా వేదికగా విడాకులకు సంబంధించి పరోక్షకంగా కన్ఫర్మేషన్ ఇచ్చేసింది. అయితే సోషల్ మీడియాలో ప్రజెంట్ షోయబ్ మాలిక్ మూడో పెళ్లికి సంబంధించిన ఫొటోస్ వైరల్ గా మారాయి .

పాకిస్తాన్ నటి సనాజావేద్ ని ఆయన వివాహం చేసుకున్నట్లు నేషనల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . గత ఏడాది ఆగస్టు 20వ తేదీనే వీళ్ళ పెళ్లి జరిగిపోయింది అంటూ సమాచారం అందుతుంది. వీళ్లు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. వీళ్ళ పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నేషనల్ మీడియాని షేక్ చేసేస్తున్నాయి . అయితే దీనిపై ఇప్పటివరకు అఫీషియల్ ప్రకటన రాలేదు . అటు సానియా మీర్జా ఇటు షోయబ్ మాలిక్ ..సనాజావేద్ ఈ పెళ్లిపై ఇంకా అఫీషియల్ ప్రకటన ఇవ్వలేదు . దీంతో సోషల్ మీడియాలో వీళ్ళ పెళ్లికి సంబంధించిన ఫోటోలపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి..!!