ఆ హీరోతో నటించడానికి ఆశ‌క్తిగా ఎదురుచూస్తున్నా.. రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన కు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. అల్లు అర్జున్ పుష్ప సినిమాతో నేషనల్ క్ర‌ష్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్లలో బిజీగా గడుపుతుంది. తెలుగు, హిందీ, తమిళ్ వంటి భాషల్లో పలు సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక క్రేజ్ సంపాదించుకుంటున్న ఈమె.. కెరియర్ లో ముందుకు దూసుకుపోతుంది. ఇటీవల రష్మిక స్టార్ హీరో ర‌ణ్‌బీర్ కపూర్ కాంబోలో వచ్చిన యానిమల్ మూవీ పాన్ ఇండియా లెవెల్ లో బాక్సాఫీస్ ను బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. హిందీలో మొదటి చిత్రంతోనే తన బోల్డ్ నటన‌తో రికార్డులను సృష్టించింది.

ఈ మూవీ తో ఫ్యాన్స్‌కు ఆశ్చర్యాన్ని కలిగించిన ఈ బ్యూటీ ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సరసన నటిచ‌న్నుంది. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున ప్రధానపాత్రలో కనిపించబోతున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా రష్మిక మందన ఓ ఇంటర్వ్యూలో సంద‌డి చేసింది. ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. ధనుష్ సరసన నటించేందుకు ఆమె ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలియజేసింది.

ఆయన మంచి నటుడని.. తన పక్కన నటించడం వల్ల పలు విషయాలు నేర్చుకోవచ్చంటూ వివరించింది. ఇక ధనుష్‌తో నటించడానికి ఇది కూడా ముఖ్య కారణం అని చెప్పుకొచ్చిన ఈ ముద్దుగుమ్మ.. వచ్చే నెల నుంచి ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాను అంటూ వివరించింది. ఆయనతో నటించే రోజు కోసం ఎంతో ఆసక్తిగా ఉన్నానని నేషనల్ రష్మిక చేసిన కామెంట్స్ వైర‌ల్ అవుతున్నాయి. ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన నీకు ధనిష్‌తో నటించడం అంటే ఎందుకు అంత స్పెషల్ అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.