హనుమాన్‌ సినిమాలో కాంతార హీరో..అంత సెట్ చేశాక చెడ కొట్టింది ఎవరు..?

హనుమాన్ .. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఈ సినిమా పేరు మారుమ్రోగిపోతుంది. సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో రిలీజ్ అయిన హనుమాన్ సినిమా సూపర్ డూపర్ హిట్ అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ల బీభత్సం కొనసాగిస్తుంది. 200 కోట్లు క్రాస్ చేసి సెన్సేషనల్ రికార్డును క్రియేట్ చేసింది. ప్రశాంత్ వర్మ పేరు కూడా ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది.

ఇలాంటి క్రమంలోనే సినిమాకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది . ఈ సినిమాలో విభూషణుడు పాత్ర కోసం ముందుగా కాంతారా హీరోని అప్రోచ్ అయ్యారట ప్రశాంత్ వర్మ . రిషిబ్ శెట్టి కూడా ఈ మూవీ లో ఆ పాత్ర పట్ల చాలా ఇంట్రెస్ట్ చూపించారట . అయితే ఆఖరి మూమెంట్లో రిషబ్ శెట్టి కొన్ని అనివార్య కారణాల చేత ఈ పాత్ర నుంచి తప్పుకున్నాడట .

ఆ తర్వాత ఆ పాత్రలోకి సముద్ర ఖని వచ్చారు . ఒకవేళ ఆ పాత్రలో రిషబ్ శెట్టి నటించి ఉంటే మాత్రం ఓ రేంజ్ లో ఇంకా కలెక్షన్స్ కుమ్మేసేది అని చెబుతున్నారు అభిమానులు. ప్రజెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . ప్రశాంత్ వర్మ రీసెంట్ గానే జై హనుమాన్ సినిమాకి సంబంధించి ప్రొడక్షన్ పనులను స్టార్ట్ చేశారు . ఈ సినిమాలో చిరంజీవి హనుమంతుడి పాత్రలో కనిపించబోతున్నాడట రాముడి పాత్రలో రామ్ చరణ్ నటించబోతున్నాడట..!!