నిన్న సానీయ-షోయబ్.. నేడు ఈ స్టార్ కపుల్.. విడాకులు తీసుకోబోతున్న క్రేజీ జంట..!?

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రిటీస్ కి విడాకులు తీసుకోవడం చాలా అలవాటుగా మారిపోయింది. మరీ ముఖ్యంగా కొంతమంది జంటలు ఎందుకు ప్రేమించుకుంటున్నారో.. ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారో.. ఎందుకు విడాకులు తీసుకుంటున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది . రీసెంట్ గా టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా అలాగే పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.

ఎంతో ఇష్టంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట విడాకులు తీసేసుకున్నారు . షోయబ్ మూడో పెళ్లి కూడా చేసుకున్నాడు . అయితే రీసెంట్ గా మరో స్టార్ కపుల్ విడాకులు తీసుకోబోతున్నారు అన్న వార్త వైరల్ అవుతుంది. సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఐశ్వర్యరాయ్ – అభిషేక్ బచ్చన్లు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది.

అయోధ్య ప్రారంభోత్సవ వేడుకల్లో అభిషేక్ బచ్చన్ ఒక్కడే కనిపించాడు . హీరోయిన్ ఐశ్వర్యరాయ్ కనిపించలేదు. దీంతో సింగిల్గానే ఆయన రావడం పట్ల మరోసారి విడాకుల వార్తలు ఊపందుకున్నాయి. దీంతో ఇప్పుడు ఈ జంట విడాకులు తీసుకున్నారా ..? లేక ఆల్రెడీ తీసేసుకున్నారా..? ఒకవేళ విడాకులు తీసుకుంటే దానికి కారణం ఏంటి..? అంటూ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు..!!