వాట్.. “కుర్చీ మడత పెట్టి” సాంగ్ ఆ హిట్ పాట్ నుండి కాపి కొట్టారా..? ఏంటి తమన్ బ్రో ఇది..!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎలా చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ అని.. తేడా లేకుండా అందరినీ ఏకీపారిస్తున్నారు . రీసెంట్గా సోషల్ మీడియాలో “గుంటూరు కారం” నుంచి రిలీజ్ అయిన స్పెషల్ మాస్ సాంగ్ ప్రోమో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు జనాలు . “కుర్చీ మడతపెట్టి” అని రిలీజ్ అయిన ఈ సాంగ్ ప్రోమో ను రీసెంట్గా గుంటూరు కారం నుంచి రిలీజ్ చేశారు మేకర్స్ .

అయితే కేవలం ప్రోమోతోనే ఈ సినిమాలోని ఈ సాంగ్ ని ఏకేస్తున్నారు . ఈ సాంగ్ అచ్చం డిట్టోగా డీజే సంగ్ ని కాపీ కొట్టినట్లు ఉంది అంటూ ట్రోల్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో గుంటూరు కారం కి సంబంధించిన స్పెషల్ సాంగ్ ప్రోమో వైరల్ గా మారింది . చూడాలి దీనిపై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఏ విధంగా స్పందిస్తాడో. ఇప్పటివరకు రిలీజ్ అయిన పాటలు అన్నీ కూడా కాపీ అంటూ ఆయన పైన నిందలు పడ్డాయి.

కేవలం గుంటూరు కారం సినిమా టైం లోనే కాదు.. అంతకు ముందు కూడా ఇలానే హ్యూజ్ ట్రోలింగ్ తమన్ పై జరిగింది. కేవలం బాలయ్య సినిమాలకు తప్పిస్తే మిగతా ఏ సినిమాలకు ఆయన ఓరిజినల్ ట్యూన్స్ ఇవ్వడు అని ట్రోలర్స్ బాగా ట్రోల్ చేశారు. ఫ్యాన్స్ కూడా బాగా ఇబ్బంది పెట్టారు..!!