‘సలార్’ పై భారీ కుట్ర.. సినిమా చూడనివ్వకుండా అడ్డుకుంటున్న థియేటర్ యాజమాన్యం..ఎందుకంటే..?

ప్రజెంట్ ఇదే న్యూస్ ని రెబెల్ అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు. సలార్ సినిమా కలెక్షన్స్ అడ్డుకోవడానికి భారీ కుట్ర జరుగుతుందా..? అంటే అవుననే అంటున్నారు. మరి ముఖ్యంగా థియేటర్స్ లో చిన్న పిల్లలను రానివ్వడం లేదని .. ఆ కారణంగా పేరంట్స్ టికెట్స్ బుక్ చేసుకున్న సరే వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కొందరు పేరెంట్స్ థియేటర్స్ వద్ద గొడవలు పెట్టుకోవడం ఇప్పుడు వైరల్ గా మారింది .

సలార్ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే . ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాలు ప్రశాంత్ నీల్ చాలా అద్భుతంగా తెరకెక్కించారు . జగపతిబాబు – శ్రేయ రెడ్డి – శృతిహాసన్ – టిన్ను ఆనంద్ భారీ స్టార్ క్యాస్ట్ నటించిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ఫ్యాన్స్ ఈ సినిమాను చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . పైగా లాంగ్ లీవ్స్ రావడంతో కుటుంబం మొత్తం కలిసి సలార్ సినిమా చూడడానికి టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు .

అయితే సినిమాకి ఏ సర్టిఫికెట్ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. చాలా సినిమాల విషయంలో లైట్ గా తీసుకునే థియేటర్ యాజమాన్యం సలార్ విషయంలో మాత్రం ఓవర్ చేస్తుంది. చిన్న పిల్లలు ఈ సినిమా చూడకూడదు అంటూ థియేటర్ బయటే పిల్లల్ని ఆపేస్తుంది . అంతేకాదు టికెట్స్ బుక్ చేసుకునే ముందు ఇది చెప్తే బాగుండేది అని.. టికెట్స్ బుక్ చేసుకున్నాక థియేటర్ కి వచ్చాక ఎలా చెప్తే ఎలా అంటూ జనాలు మండిపడుతున్నారు.

హైదరాబాద్ ఉప్పల్ డిఎస్ఎల్ మాల్ లో ఏకంగా ఓ కుటుంబం థియేటర్ యాజమాన్యంతో గొడవ పెట్టుకునింది . ప్రజెంట్ దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. అయితే గబ్బు గబ్బు సీన్లు ఉన్న సినిమాలలోనే చిన్న పిల్లల్ని ఎంట్రీ కి ఒప్పుకుంటున్న థియేటర్స్ సలార్ సినిమాల విషయం మాత్రం మరీ ఓవర్ చేస్తుంది అంటున్నారు రెబెల్ అభిమానులు..!!