20 ఏళ్ల తరువాత “గుంటూరు కారం” కోసం అలాంటి పని.. చరిత్ర తిరగరాసిన మహేశ్ బాబు..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు తాజాగా నటించిన సినిమా “గుంటూరు కారం”. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జనవరి 12న సంక్రాంతి కానుకగా గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక్కొక్క పాటను రిలీజ్ చేస్తూ ముందుకు వెళుతున్నాడు త్రివిక్రమ్.

తాజాగా క్రిస్మస్ సందర్భంగా “గుంటూరు కారం” సినిమాకి సంబంధించిన స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు . అయితే గుంటూరు కారం సినిమాకి సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . మహేష్ బాబు ఈ సినిమాలో ఓ పాట పాడాడు అన్న న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది.

 

అప్పుడెప్పుడో 20 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన ఒక్కడు సినిమాలో “చెప్పవే చిరుగాలి” సాంగ్ పాడిన మహేష్ ఆ తర్వాత అలాంటి సాహసం చేయలేదు . అయితే గుంటూరు కారంలో మాత్రం శ్రీ లీలను ఇంప్రెస్ చేయడానికి చెప్పవే చిరుగాలి పాట పాడతాడట . ఈ సీన్ కి ధియేటర్స్ లో విజిల్స్ మోగాల్సిందే అంటున్నారు ఫ్యాన్స్. ప్రజెంట్ ఇదే న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!