చరణ్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఓ భారీ సినిమా… అసలు ట్విస్ట్ ఏంటంటే..!

ప్రశాంత్ నీల్ తాజాగా తెరకెక్కించిన ” సలార్ ” మూవీ భారీ హిట్ అవడంతో ఈయనపై అనేక అంచనాలు పెరుగుతున్నాయి. సలార్ 2 మూవీ మొదట మొదలవుతుందా? లేక ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబో మూవీ మొదట మొదలవుతుందా ? అనే ప్రశ్నలు అందరిలోనూ నెలకొన్నాయి. ఇకపోతే చరణ్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కితే బాగుంటుందని చాలామంది అభిమానులు ఫీల్ అవుతున్నారు.

ఇక చిరంజీవి, రామ్ చరణ్ మల్టీస్టారర్ గా ఈ మూవీ తెరకెక్కితే మరింత బాగుంటుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ప్రశాంత్ నీల్ ఇప్పటివరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను పూర్తి చేశాకే ఈ కాంబో సెట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రశాంతి నీల్ కుటుంబం కంటే సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడట.

ఒక సినిమా తెరకెక్కించాలంటే తన ప్రాణం పెట్టేస్తాడట ప్రశాంత్ నీల్. ఇక ఈయన సలార్ సినిమాకు 50 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యూనిరేషన్ తీసుకున్న సంగతి తెలిసిందే.‌ ఇక ప్రస్తుతం సలార్ మూవీ దేశవ్యాప్తంగా ఊచకోత కోస్తుందనే చెప్పాలి. ఇక రానున్న రోజుల్లో చరణ్, ప్రశాంత్ నీల్ కాంబో సెట్ అవుతుందో లేదో చూడాలి. ఇక వీరి కాంబోలో సినిమా కనుక వస్తే అది పక్క సూపర్ హిట్ అవుతుందంటూ కొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక రానున్న కాలంలో ఏం జరుగుద్దో చూద్దాం.