‘ యానిమ‌ల్ ‘ మూవీలో విల‌న్ రోల్ మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరో.. ఎవ‌రంటే..?

బాలీవుడ్ స్టార్ హీరో రాణ్‌బీర్ కపూర్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా నటించిన మూవీ యానిమల్. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్న యానిమల్ మూవీ పై రిలీజ్ కు ముందే మంచి అంచనాలను నెలకొన్నాయి. ఇటీవల ఈ సినిమా రిలీజై ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంతో పాజిటివ్ టాక్‌ను దక్కించుకుంది. ఇక సందీప్ రెడ్డి మార్క్ వైలెన్స్, రొమాన్స్ అన్ని ఈ సినిమాల్లో కళ్ళకు కట్టినట్లుగా చూపించాడు.

Animal Teaser: Bobby Deol Impresses Netizens With 'Deadly' Look As Villain  Opposite Ranbir Kapoor

ఇక ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో విలన్ పాత్రలో ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరో బాబీ డియోలో నటించిన సంగతి తెలిసిందే. అయితే సినిమాలో విలన్ పాత్ర కూడా చాలా పవర్ ఫుల్ గా కనిపించింది. హీరో, విలన్ మధ్యన సన్నివేశాలను రసవత్తరంగా రూపొందించాడు సందీప్ రెడ్డి. అయితే ఈ విలన్ రోల్ కోసం మొదట ఓ టాలీవుడ్ హీరోని అనుకున్నార‌ట.

I didn't set out to be a regular hero: Rana Daggubati

మొదటగా టాలీవుడ్ స్టార్ హీరో అయినా రానాకు ఈ విలన్ పాత్రను ఇవ్వాలని సందీప్ రెడ్డి భావించాడట. విల‌న్ పాత్రలకు రానా 100% ఇస్తాడనే ఉద్దేశంతో మొదట రానాకి కథను వినిపించగా.. అనారోగ్య కారణాలతో ఈ సినిమాకు నో చెప్పాడట రానా. ఏదో ప్రాబ్లం తో ఫారెన్ లో ట్రీట్మెంట్ చేయించుకోవడానికి రానా వెళ్లడని.. ఆ సమయంలో సందీప్ రెడ్డి సినిమాలో నటించడం కుదరకపోవడంతో దాన్ని రిజెక్ట్ చేశాడని తెలుస్తోంది. తర్వాత బాబి డియో లో ఈ అవకాశం వచ్చింది.