డబ్బుల కోసం అంతకు దిగజారిన అనుష్క… ఇదెక్కడ దరిద్రం రా బాబు…!!

అనుష్క శెట్టి ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈమె అందంతో, నటనతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. దాదాపు అందరి స్టార్ హీరోల సరసన నటించింది. ఇక ఈ ముద్దుగుమ్మ దాదాపు సినిమా ఇండస్ట్రీలో 18 ఏళ్ల పాటు తన సత్తాను చాటుతూ కొనసాగుతుంది. ప్రతి ఒక్క హీరోయిన్ కి గట్టి పోటీని ఇస్తూ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. ఈ ముద్దుగుమ్మ కేవలం తెలుగు, తమిళ్ భాషల్లోనే నటిస్తుంది.

ఇక ఈమధ్య అనుష్కకి పెద్దగా అవకాశాలు రావడం లేదు. సైజ్ జీరో సినిమా కోసం ఎక్కువ బరువు పెరిగిన అనుష్క ఆ తర్వాత బరువు తగ్గించలేకపోయింది. దీంతో ఈ ముద్దుగుమ్మని అందరూ పక్కన పెట్టేశారు. దాదాపు మూడేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న అనుష్క ” మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ” సినిమాతో మళ్లీ రియంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో టెక్నాలజీని ఉపయోగించి అనుష్కను సన్నగా చూపించినప్పటికీ… మొహం మాత్రం చాలా బొద్దుగా కనిపించింది.

ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మలయాళంలో ఓ సినిమాలో నటిస్తుంది. ఇక 2018 లో వచ్చిన భాగమతి సినిమా సీక్వెల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట అనుష్క. ఇక ఇదిలా ఉండగా… సైజ్ జీరో కోసం అనుష్క బరువు పెరగడం… కారణంగానే అనుష్క కెరీర్ నాశనం అయిందని ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు. డబ్బులు కోసం బాడీని మార్చుకోవడం తప్పంటూ..ఇదెక్కడ దరిద్రం రా బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు .