ఆ మూవీ చేసుంటే హీరో శివాజి కెరీర్ మ‌రోలా ఉండేదా.. ఇంత‌కి ఆ మూవీ ఎంటో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన శివాజీ.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హీరోగా పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. మిస్సమ్మ సినిమాతో పాపులారిటీ దక్కించుకున్న శివాజీ భూమిక, లయ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ తో సూపర్ హిట్ త‌న‌ ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా తర్వాత శివాజీ ఒట్టేసి చెబుతున్న, ఖుషి, ఇంద్ర, సందడే సందడి, ప్రియమైన నీకు, మిస్ట‌ర్ అండ్ మిసెస్ శైల‌జ కృష్ణ మూర్తి లాంటి ఎన్నో హిట్ సినిమాల్లో నటించాడు. అయితే గ‌త‌ కొంతకాలంగా అవకాశాలు రాకపోవడంతో ఇండస్ట్రీకి దూరమైన శివాజీ ఇటీవల బిగ్ బాస్ హౌస్ లో కన్సిస్టెంట్గా ఎంట్రీ ఇచ్చి తన గేమ్తో మళ్లీ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.

Sivaji Telugu Hero

ఈ సీజన్లో టైటిల్ గెలుచుకునే వారిలో మొదటగా శివాజీ పేరే వినిపిస్తుంది. ఇక ఈ షో ద్వారా బాగా పాపులారిటీ ద‌క్కించుకున్న శివాజీకి హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వరుస‌ ఆఫర్లు క్యూ కడతాయంటూ ఫ్యాన్స్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో శివాజీ హీరోగా ఉన్న టైంలో తన కెరీర్ ను మార్చేసే ఓ భారీ బ్లాక్ బస్టర్ మిస్ చేసుకున్నడట. అదే సినిమాను శివాజీ నటించి ఉంటే ఈపాటికి అతని కెరీర్ వేరేలా ఉండేదట‌. ఆ సినిమానే పవన్ కళ్యాణ్ హీరోగా నటించి సక్సెస్ అందుకున్నాడని తెలుస్తుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటి.. అసలు ఏం జరిగిందో.. ఒకసారి చూద్దాం. డైరెక్టర్ కరుణాకర్ దర్శకత్వంలో తెరకెక్కిన తొలిప్రేమ.

Bigg Boss Telugu 7: Sivaji's frustration over 'serial batch' gets intense!  - Times of India

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమా ఆడిషన్స్ టైం లో మాస్టర్ చిత్రంలో నటించిన శివాజీని చూసి ఈ సినిమాకు అతను హీరోగా బాగుంటాడు అని భావించారట. కానీ అదే టైంలో పవన్ కళ్యాణ్ మొదటి సినిమా పోస్టర్ చూసి హీరో అంటే ఇలా ఉండాలి.. నా తొలిప్రేమ కథ‌కి ఇత‌నే పర్ఫెక్ట్ అని డైరెక్టర్ భావించాడట. తర్వాత పవన్ కళ్యాణ్ కి స్టోరీ చెప్పడం ఆయన ఓకే చేయడంతో.. పవన్ కళ్యాణ్ హీరోగా స్టోరీని స్టార్ట్ చేసి సక్సెస్ అందుకున్నాడు. ఒకవేళ పవన్ కళ్యాణ్ హీరో కాక‌పోయి ఉంటే శివాజీనే ఈ సినిమాలో నటించేవాడట. ప్రస్తుతం ఈ న్యూస్‌ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో శివాజీ ఈ సినిమాలో నటించి ఉంటే ఖ‌చ్చితంగా అతని రేంజ్ వేరేలా ఉండేది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెట్టిజ‌న్లు.