టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న మూవీ గుంటూరు కారం. ఈ సినిమా జనవరి 12 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. సర్కారు వారి పాట సినిమా తర్వాత ఏడాదిన్నర గ్యాప్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇక గతంలో త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కాంబోలో అతడు, ఖలేజా లాంటి ఐకానిక్ సినిమాలు తెరకెక్కి మంచి మార్కులు కొట్టేసాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమాపై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
అదే విధంగా సినిమా నుంచి ప్రమోషనల్ కంటెంట్‌గా బయటకు వచ్చిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ కూడా ప్రేక్షకులను వేరే లెవెల్ లో ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా కూర్చి మడత పెడితే అనే సాంగ్ ప్రోమో కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ పాట మాస్ ఆడియన్స్ లో గుంటూరు కారం సినిమాపై క్రేజ్ ను పెంచేసింది. ఇక అసలు విషయానికి వస్తే మహేష్ బాబు – త్రివిక్రమ్ ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డేట్ ల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారట. మహేష్, త్రివిక్రమ్… పవన్ కోసం ఎదురు చూడటం ఏంటి..? గుంటూరు కారంకి.. పవన్ కి సంబంధం ఏంటి..? అనుకుంటున్నారా.
అసలు విషయం ఏంటంటే గుంటూరు కారం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని జనవరి 7, 8 తేదీల్లో హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలో గ్రాండ్ గా నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ ఈవెంట్ కి పవర్ స్టాప్ పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిథిగా వస్తే ప్రమోషన్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉంటుందని.. సినిమాకు హైలైట్ అవుతుందని మహేష్ బాబు భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని త్రివిక్రమ్ కి చెప్తే ఆయన కూడా ఓకే చేసినట్లు తెలుస్తుంది. అయితే జనవరి 7,8 తేదిలో పవన్ కళ్యాణ్ డేట్ లో అందుబాటులో ఉంటాయా లేదా అనేది ఇప్పుడు అసలు ప్రశ్న.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో ఫుల్ బిజీగా చర్చలు జరుపుతున్నాడు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ డేట్‌లు ఆ సమయానికి ఖాళీ ఉంటాయా లేదా అని విషయాన్ని త్రివిక్రమ్ తెలుసుకోవాలని ప్రయత్నంలో ఉన్నాడట. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఈవెంట్‌కి వస్తే మహేష్, పవన్ మ్యూచువల్ ఫ్రెండ్స్ అందరికీ పండగల ఉంటుంది. కేవలం ఒకటి, రెండు సందర్భాల్లోనే పవన్, మహేష్ కలిసి ఒక వేదికపై కనిపించారు. అలా కనిపించి కూడా చాలా ఏళ్లు అవ్వడంతో.. మళ్లీ గుంటూరు కారం ప్రమోషన్స్ లో ఈ స్టార్ హీరోలు ఇద్దరు కలిస్తే బాగుంటుందని అభిమానులు కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.