బిగ్ బాస్ విన్నర్ కౌశల్ మూవీ ట్రైలర్ లాంచ్ చేసిన ఆ స్టార్ హీరో… మంచోడినే పట్టావుగా..!

బిగ్ బాస్ ద్వారా క్రేజ్ తెచ్చుకున్న వారిలో కౌశల్ ఒకరు. బుల్లితెర యాక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన కౌశల్.. బిగ్ బాస్ సీజన్ 2 కి విన్నర్ గా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం ఈయన హీరోగా ” రైట్ ” అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు.

మణి దీప్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మించిన ఈ మూవీ తమిళ్, హిందీ సినిమా ” మెమోరీస్ ” కి రీమేక్ కావడం విశేషం. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్గా జరిగింది. ఈ ట్రైలర్ ని విడుదల చేసేందుకు హీరో మంచు మనోజ్ హాజరయ్యాడు. అనంతరం మంచు మనోజ్ మాట్లాడుతూ..” కౌశల్ తన టాలెంట్ తో ఎదిగిన వ్యక్తి.

తనకంటూ ఒక ఆర్మీ నే ఉందంటే అది సామాన్యమైన విషయం కాదు. ఎన్నో కష్టాలు చూసి ఈ స్థాయికి వచ్చిన కౌశల్ ఈ ఇయర్ ఎండింగ్ లో హిట్ కొట్టి తన ప్రస్థానాన్ని కొనసాగించాలి. రైట్ మూవీ ట్రైలర్ చాలా బాగుంది. ఈ సినిమా తప్పకుండా హిట్ కొడుతుందని ఆశిస్తున్నా ” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమా డిసెంబర్ 30న గ్రాండ్గా ఆడియన్స్ ముందుకు రానుంది.