నా సక్సెస్ సీక్రెట్ అదే.. నయనతార ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

సౌత్ ఇండియా స్టార్ బ్యూటీ నయ‌నతారకు ప్రత్యేక ప‌రిచ‌యం అవసరం లేదు. లేడీ సూపర్ స్టార్ గా క్రేజ్‌ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల షారుక్ జవాన్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ పాపులారిటీ దక్కించుకుంది. సౌత్ స్టార్ హీరోయిన్‌ల‌లో హైయెస్ట్ రెమ్యూనరేషన్ అందుకుంటున్న వారిలో నయనతార ఒకటి. కమర్షియల్ మూవీలో హీరోయిన్ గా కెరీర్ ఆరంభించిన ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్గా క్రేజ్‌న సంపాదించుకుంది.

తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకున్న ఈ బ్యూటీ లేడీ సూపర్ స్టార్‌గా తిరుగులేని స్టార్‌డ‌మ్‌ను సొంతం చేసుకుంది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు అవుతున్న అదే పాపులారిటీతో దూసుకుపోతున్న ఈమె తాజాగా సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ కు అభినందనలు తెలియజేసింది. అభిమానులే నా హార్ట్ బీట్. నన్ను నడిపించిన పవర్. కెరీర్‌లో అప‌జ‌యాలు ఎదురైన ప్రతిసారి చేయూతనిచ్చింది.

నా అభిమానులే నాలో మోరల్ పవర్ ని పెంచారు. మీ వల్ల 20 ఏళ్ల ప్రయాణం నాకు సాధ్యమైంది. మీ అందరి హ్యాపీనెస్.. నేను ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నా. మీ ప్రేమ, ఆదరణ వల్లే నేను ఇప్పుడు ఈ స్టేజ్‌లో ఉన్నా. ఇలాగే మీ ఆదరణ నాపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా అంటూ వివరించింది. ప్రస్తుతం నయన్‌ చేసిన కామెంట్స్‌ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.