సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ హనుమాన్ ‘.. టోటల్ రన్ టైమ్ ఎంతంటే..?

క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్సిటీ నుంచి వస్తున్న ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ మ్యాన్‌ సినిమా హనుమాన్. తేజ స‌జ్జా, అమృత అయ్యర్ జంటగా నటిస్తున్న ఈ సినిమాల్లో వరలక్ష్మి కీలక పాత్రలో నటిస్తుంది. ఈ సినిమాని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్‌పై కే.నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. శ్రీమతి చైతన్య సమర్పిస్తున్న ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా అశ్రిన్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్ గా వెంకట్ కుమార్ జెట్టి, అసోసియేటివ్ ప్రొడ్యూసర్ గా కుసల్ రెడ్డి ఇలా చాలామంది వ్యవహరిస్తున్నారు.

ఇక తాజాగా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ అదిరిపోయే రెస్పాన్స్ అందుకున్ని నేషనల్ లెవెల్ లో క్రేజ్‌ను సంపాదించుకున్నాయి. ఇక ఈ సినిమాపై భారీ అంచనాలను నెలకొన్నయి. ఈ సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడడంతో సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. మూవీటీం ప‌లు ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు.

ఇక తాజాగా హనుమాన్ సెన్సార్ కార్యక్రమాన్ని పూర్తిచేసుకుంది. ఈ సినిమాకు యూ\ఎ సర్టిఫికెట్ వచ్చింది. ఇక హనుమాన్ రన్ టైం 2: 38 నిమిషాలు ఉండబోతుంది. హనుమాన్ విజువల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయని ట్రైలర్ బట్టి అర్థమవుతుంది. ఇక టాలీవుడ్ లోనే మొట్టమొదటి సూపర్ మాన్ స్టోరీ సినిమా తెరకెక్కుతున్న‌ ఈ సినిమాతో తేజ సజ్జ ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుంటుందో వేచి చూడాలి.