2023 ఇండియా టాప్ గ్రాసర్ గా ఆ స్టార్ హీరో మూవీ…!

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన మొత్తం మూడు సినిమాలు కూడా ఈ ఏడాది ఆడియన్స్ ముందుకి వచ్చి బాక్సాఫీస్ ని షేక్‌ చేశాయని చెప్పాలి. ముందుగా జనవరిలో రిలీజ్ అయిన పఠాన్ రూ.1000 కోట్లకు పైగా గ్రాస్ ని సొంతం చేసుకోగా.. అనంతరం సెప్టెంబర్ లో రిలీజ్ అయినటువంటి జవాన్ మూవీ రూ.1154 కోట్ల గ్రాస్ కొల్లగొట్టింది.

ఇక ప్రస్తుతం థియేటర్స్ లో రన్ అవుతున్న డన్కి ఇప్పటికే కోట్లకు పైగా గ్రాస్ ని దాటేసి ముందుకు సాగుతుంది. ఇక అసలు విషయంకి వస్తే.. మొత్తంగా ఈ ఏడాది అత్యధిక గ్రాస్ సొంతం చేసుకున్న ఇండియన్ మూవీ గా జవాన్ టాప్ ప్లేస్ లో నిలిచింది.

ఇక ఈ మూవీ ఓవర్సీస్ నుంచి రూ. 400 కోట్లు, హిందీ వెర్షన్ రూ. 590 కోట్లు నెట్ కలెక్షన్ ని సొంతం చేసుకుంది. అలాగే అటు తెలుగు, తమిళ్ వెర్షన్స్ లో కూడా జవాన్ భారీ కలెక్షన్స్ ని రాబట్టింది. అట్లీ దర్శకత్వం వహించినటువంటి ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో నయనతార మరియు దీపికా పదుకొనె హీరోయిన్స్ గా నటించారు. ఇక 2023 టాప్ గ్రాసర్ గా నిలవడంతో షారుఖ్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.