జబర్దస్త్ వర్ష పై బూతు కామెంట్స్.. కన్నీళ్లు పెట్టుకున్న యంగ్ బ్యూటీ.. అసలు ఏం జరిగిందంటే..?

జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి పాపులారిటీ దక్కించుకుంది యాక్టర్ వర్ష. మొదటి బుల్లితెరపై పలు సీరియల్ లో నటించిన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత జబర్దస్త్ ఎంట్రీ ఇచ్చి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. తన పర్ఫామెన్స్ తో, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈటీవీలో జరిగే పలు ఈవెంట్లలో ఈ ముద్దుగుమ్మ సందడి చేస్తూ వస్తుంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను ఫాన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈమెకు జరిగిన ఓ షాకింగ్ ఇన్స్‌డెంట్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది.

తాజాగా వర్షా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త్రిబుల్ ఏ థియేటర్‌లో సినిమా చూసేందుకు వెళ్లానని.. అక్కడ తన కార్ వాలెట్ పార్కింగ్ ఇచ్చానని చెప్పుకొచ్చింది. తిరిగి సినిమా చూసి వచ్చి కార్ తీసుకునేందుకు అవుట్ సైడ్ వేచి ఉండగా.. కార్‌ తీసుకువచ్చే టైంలో ఓ వ్యక్తి నాపై దుర్భాషలాడాడు అంటూ చెప్పుకొచ్చింది. అతని ప్రవర్తన, మాటలు నన్ను చాలా బాధపెట్టాయని.. ఫ్యామిలీ ముందే అతను బూతులు మాట్లాడడం చాలా బాధ కలిగించిందంటూ చెప్పుకోచ్చింది. అతను చేష్టలకు భయమేసిందని.. అయినా ఆ వ్యక్తి ప్రవర్తనను నేను ప్రశ్నించాను అంటూ వివరించింది.

అదే పరిస్థితిలో వేరే అమ్మాయి ఉంటే అతను మాట్లాడిన మాటలను ఎలా తీసుకుంటారు.. పబ్లిక్‌లో ఆ వ్యక్తి ప్రవర్తించిన విధానం వల్ల సొసైటీలో ఆమెపై ఎలాంటి అభిప్రాయం ఏర్పడుతుంది అంటూ ప్రశ్నించింది. దీనికి సంబంధించిన వీడియోను రిలీజ్ చేసిన వర్ష అతని బూతు కామెంట్లను తలుచుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆ వ్యక్తి ఫోటోను కూడా ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తానని వివరించింది. దయచేసి ఇలా అమ్మాయిల విషయంలో ఎవరు ప్రవర్తించవద్దని.. దీని కారణంగా ఏదో ఒక కుటుంబం చాలా బాధపడాల్సి వస్తుందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం వర్ష చెప్పిన మాట‌లు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆమె ఫ్యాన్స్ ఆ వ్యక్తిపై ఫైర్ అవుతున్నారు.