‘ నా ఏజ్ వాళ్లంతా గర్ల్ ఫ్రెండ్స్ తో లైఫ్ ఎంజాయ్ చేస్తుంటే నేను మాత్రం ఇలా ‘.. అల్లు శిరీష్ ఇన్స్టా పోస్ట్ వైరల్..

టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తనయుడిగా.. అల్లు అర్జున్ తమ్ముడు గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడు అల్లు శిరీష్. 2013లో గౌరవం సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన ఈ హీరో కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే వరుస‌ సినిమాల్లో నటిస్తున్న ఒక్క మంచి బ్లాక్ బాస్టర్ హిట్ కూడా పడకపోవడంతో నటన పరంగా పలు విమర్శలను ఎదుర్కొంటున్నాడు. ఇక చివరిగా ఊర్వశివ రాక్షసివో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అను ఇమ్మాన్యుల్ ఇందులో హీరోయిన్గా నటించింది.

ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా.. కమర్షియల్ గా హిట్ కాలేకపోయింది. ప్రస్తుతం తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేస్తున్నాడు అల్లు హీరో. ఐతే ఓవైపు మూవీస్‌కోసం ట్రై చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నాడు సిరీష్‌. తన సినీ అప్డేట్స్ తో పాటు.. పర్సనల్ అప్డేట్స్ కూడా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటాడు. ఇక ఇటీవల మెగా హీరో వరుణ్ తేజ్ బ్యాచిలర్ లైఫ్ కు ఫుల్ స్టాప్ పెట్టి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. వీరి పెళ్లి వేడుకలు సాయి ధరంతేజ్, వైష్ణవ తేజ్, అల్లు శిరీష్ సందడి చేశారు.

ఇక ఇప్పుడు ఈ ముగ్గురు యంగ్ హీరోస్ పెళ్లికి రెడీగా ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా అల్లు శిరీష్ తన ఇన్స్టా స్టోరీగా షేర్ చేసుకున్న ఒక్క వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తన ఇన్స్టా స్టోరీలో ఓ ఫ‌నీ రీల్ షేర్ చేసుకున్నాడు అల్లు శిరీష్. తన ఏజ్ వాళ్లంతా అమ్మాయిలతో లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు.. తను మాత్రం జిమ్లో ఐదు కేజీల డంబులు ఎత్తుకొని వర్క్ అవుట్ చేస్తున్నాను అన్నట్లుగా ఓ వీడియోను షేర్ చేశాడు. తన జీవితం కూడా అలానే ఉందంటూ ఏడుస్తున్న ఎమోజీలను ఆ వీడియో పై ట్యాగ్ చేశాడు. అల్లు శిరీష్ ప్రస్తుతం షేర్‌ చేసిన ఈ వీడియో స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.