లెజెండ్రీ డైరెక్టర్ కే. విశ్వనాథ్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఫిబ్రవరి 2వ తేదీన మరణించిన విషయం తెలిసిందే. అయితే ఈయన మరణించిన తరువాత ఎంతోమంది విశ్వనాథ్ గారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అదేవిధంగా ఈయనకు సంబంధించిన ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే విశ్వనాథ్ కి ఎన్టీఆర్ కి మధ్య జరిగిన గొడవ కారణంగా వీరిద్దరికీ 14 సంవత్సరాల పాటు మాటలు లేవని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. ఇక ఈ విధంగా ఎన్టీఆర్, విశ్వనాథ్ గారు మధ్య గొడవ ఎందుకు వచ్చింది? అసలు ఎందుకు మాట్లాడుకోలేదు? అనే విషయాలు కు వస్తే… కాలేజీ చదివే రోజులలోనే ఎన్టీఆర్.. విశ్వనాథ్ గారికి సీనియర్ అట.
అలా వీరిద్దరి మధ్య ఎంతో మంచి పరిచయం ఉంది. ఇక ఎన్టీఆర్ చదువు పూర్తి అయిన తర్వాత సినిమా రంగంలోకి అడుగు పెట్టారు. ఇక విశ్వనాథ్ గారు కూడా చదువు పూర్తయిన అనంతరమే సినిమా రంగంలోకి అడుగు పెట్టారు. దీంతో వీరిద్దరి మధ్య ఎంతో మంచి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కారణంగానే అనేక సినిమాలు సైతం చేశారు. ఇక వీరి కాంబోలో వచ్చిన నాలుగో సినిమా ” చిన్ననాటి స్నేహితులు “. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఎన్టీఆర్, విశ్వనాథ్ మధ్య మనస్పర్ధలు ఏర్పడినట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమా షూటింగ్లో భాగంగా ఎన్టీఆర్ సన్ గ్లాసెస్ పెట్టుకుని లోకేషన్ లోకి వచ్చారట.
అయితే అది సెంటిమెంట్ సీన్ కావడంతో సన్ గ్లాసెస్ బాగుండవని విశ్వనాథ్ చెప్పినప్పటికీ ఎన్టీఆర్ ఆ సన్ గ్లాసెస్ తో నటించారట. ఇక ఇలా వీరిద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే ఎన్టీఆర్, విశ్వనాథ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారట. అలాగే ” డబ్బుకు లోకం దోసోహం ” అనే సినిమాకు ముందుగా విశ్వనాథ్ దర్శకత్వం వహించాల్సి ఉండగా.. ఎన్టీఆర్ ఆయనని తొలగించి యోగానంద్ ను డైరెక్టర్ గా తీసుకున్నారు. ఇక ఈ గొడవల కారణంగా వీరిద్దరి మధ్య 14 సంవత్సరాల పాటు మాటలు లేకుండా గడిపారట. అయితే బాలకృష్ణ హీరోగా నటించిన ” జనని జన్మభూమి ” సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరూ మళ్లీ మాట్లాడుకున్నారట.