మాస్ మహారాజ్ రవితేజ ఇటీవల టైగర్ నాగేశ్వర్ రావు సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. స్టువర్ట్‌పురం గజదొంగ టైగర్ నాగేశ్వర్ రావు జీవితం ఆధారంగా వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ సంపాదించుకుంది. ఈ మూవీ తర్వాత ఈగల్ సినిమాలో నటిస్తున్నాడు రవితేజ. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయినా పోస్టర్, టీజర్ ప్రేక్షకులలో మంచి హైప్ తెచ్చిపెట్టాయి. అనుపమ హీరోయిన్గా, డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాలో సరికొత్త కంటెంట్తో మాస్ మహారాజ్ కనిపించబోతున్నాడు.
ఇక హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తున్న రవితేజ ప్రస్తుతం ఈగల్ షూటింగ్‌లో బిజిగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత గోపీచంద్ మల్లినేనీ తో మరో క్రేజీ ప్రాజెక్ట్ కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. అయితే ఈ ప్రాజెక్ట్ పై మాస్ మహారాజ్ మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా సమాచారం. రవితేజ, గోపీచంద్ కాంబినేషన్లో ఇప్పటికే డాన్ శీను, బలుపు, క్రాక్ సినిమాలు రిలీజ్ అయి మంచి హిట్లుగా నిలిచాయి. ఇక ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబో రిపీట్ కాబోతోంది. దీంతో ఈ సినిమాపై కూడా మంచి హైప్ నెలకొంది. ఈ సినిమాలో రవితేజ పవర్ఫుల్ యాక్షన్‌తో రాబోతున్నాడట. పూర్తిగా రాయాలసీమ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతోందట.
రవితేజ కూడా రాయలసీమ ఫ్లేవర్ కోసం తన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ.. వైవిధ్యంగా చూపించబోతున్నట్లు సమాచారం. ఇక రాయలసీమ ప్రాస పర్ఫెక్ట్ గా ఉండేలా ప్రత్యేకంగా రచయితల వద్ద శిక్షణ తీసుకుంటున్నాడట. నిజ జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగానే ఈ సినిమా రూపందబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాలో డైలాగులు కూడా చాలా పవర్ఫుల్‌గా ఉంటాయట. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమాను తర్కెక్కించబోతున్నారు. వచ్చే ఏడది చివర్లో సినిమా రిలీజ్ చేసే విధంగా మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.