పొలిమేర-2 చిత్రంతో జాక్పాట్ కొట్టిన నిర్మాతలు..!!

ఈ ఏడాది టాలీవుడ్లో బడా సినిమాల కంటే చిన్న సినిమాల హవానే ఎక్కువగా కొనసాగుతోంది. బయ్యర్స్ కి నిర్మాతలకు సైతం అత్యధిక లాభాలు తెచ్చిపెడుతున్నవి కూడా ఈ చిన్న చిత్రాలే.. అందుకనే చాలామంది పెద్దపెద్ద నిర్మాతలు బ్యానర్ వారు చిన్న సినిమాలను తెరకెక్కించడానికి మక్కువ చూపిస్తున్నారు. అలా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న చిన్న చిత్రాలలో మా ఊరి పొలిమేర-2 కూడా ఒకటి లాక్ డౌన్ సమయంలో మా ఊరి పొలిమేర సినిమా ఓటీటి లో విడుదలై భారీ విజయాన్ని అందుకొని అద్భుతమైన రెస్పాన్స్ అందుకున్నది.

ఇక అందుకు తగ్గట్టుగానే పొలిమేర-2 చిత్రాన్ని థియేటర్లో విడుదల చేయడం జరిగింది. ఇందులో ఆసక్తికరమైన ట్విస్ట్ లతో చాలా త్రిల్లింగ్ అనుభూతిని సైతం ప్రేక్షకులకు కలిగించింది.కమర్షియల్ గా బ్లాక్ బాస్టర్ హిట్ ని అందుకోవడం జరిగింది. అయితే బడ్జెట్ కారణంగా కాస్త తక్కువలోనే ఈ సినిమా తీశారని చెప్పవచ్చు. VFX కాస్త ఉపయోగించి ఉంటే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండేదని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమా థియేటర్ దాదాపుగా భారీ లాభాలు వచ్చాయని తెలుస్తోంది.

3.40 కోట్ల రూపాయల ఫ్రీ రిలీజ్ థియేటర్ బిజినెస్ జరగా మొదటి మూడు రోజులలోనే ఈ సినిమా బ్రేక్ ఈవెంట్ సైతం దాటిపోయింది. ఫస్ట్ వీక్ లోనే దాదాపుగా 8 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. దీంతో 5కోట్లకు పైగా లాభాలు వచ్చాయని చెప్పవచ్చు. ఈ చిత్రం ఓవరాల్ గా 12 కోట్ల రూపాయల షేర్ ని రాబట్టింది. అయితే బిజినెస్ జరిగిన దానికంటే మూడింతల లాభం నిర్మాతలకు వచ్చింది. నిర్మాతలకి బయర్లకి ఏ సినిమా జాక్పాట్ అని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని ఐదు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు.