బెస్ట్ చెఫ్ కావాలనుకుంటున్న నయన్… ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు (వీడియో)…!!

లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈమె అందం, నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇక ” జవాన్ ” సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ బ్యూటీ.. సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. ఇక నయన్ తాజాగా నటిస్తున్న మూవీ ” అన్నపూరణి ” .

కొత్త దర్శకుడు నీలేష్ కృష్ణ రూపొందిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ విడుదల చేశారు మేకర్స్. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన నయనతార ఒక ప్రొఫెషనల్ చెఫ్ అవ్వాలనుకుంటుంది.

Annapoorani Trailer: Nayanthara Plays A Passionate Chef In Her 75th Film | Tamil News, Times Now

ఈ క్రమంలోనే తనకు ఎదురైన కష్టాలను, ఒత్తిడిని తట్టుకునే దశలో బెస్ట్ చెఫ్ గా ఎలా ఎదిగింది అనేదే ఈ సినిమా కథ. ఇక ఈ సినిమాలో జై, సత్యరాజ్, అచ్యుత్ కుమార్, కెఎస్ రవికుమార్, నరేష్ చక్రవర్తి తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఇక ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.