`లియో` టైటిల్ వివాదం.. ఫైన‌ల్ గా నిర్మాత‌ల‌కు ఎంత బొక్క ప‌డిందో తెలుసా?

కోలీవుడ్ స్టార్ ఇళ‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్‌, ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ లోకేష్ కనగరాజ్ కాంబినేష‌న్ లో రూపుదిద్దుకున్న హై ఓల్టేజ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `లియో` మ‌రి కొన్ని గంట‌ల్లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. చెన్నై బ్యూటీ త్రిష ఇందులో హీరోయిన్ గా న‌టిస్తే.. అర్జున్ స‌ర్జా, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. అనిరుధ్ రవిచందర్ స్వ‌రాలు అందించాడు.

సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యాన‌ర్ పై నిర్మిత‌మైన లియో.. రేపు తెలుగు, త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో గ్రాండ్ రిలీజ్ కాంబోతోంది. ఇప్ప‌టికే వ‌ర‌ల్డ్ వైడ్ గా ఈ మూవీ ప్రీ బుక్కింగ్ సేల్స్ జోరుగా సాగుతున్నాయి. ఇదిలా ఉంటే.. తెలుగులో లియో టైటిల్ పై వివాదం నెల‌కొన్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా టైటిల్‌ మరొకరు రిజిస్టర్‌ చేయడంతో.. లియో తెలుగు వెర్ష‌న్ రిలీజ్ కు ఆట‌కం ఏర్ప‌డింది.

డి-స్టూడియోస్ నేరుగా కోర్టును ఆశ్ర‌యించ‌డంతో.. విచార‌ణ చేప‌ట్టిన సిటీ సివిల్ కోర్టు లియో విడుద‌ల‌పై స్టే విధించింది. దీంతో అనుకున్న టైమ్ కు విజ‌య్ సినిమా రావ‌డం క‌ష్ట‌మే అనుకున్నా.. తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న నిర్మాత నాగ‌వంశీ తాజాగా లియో విడుదల‌లో ఎలాంటి మార్పు లేద‌ని క్లారిటీ ఇచ్చారు. స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. అయితే ఇప్పుడు `లియో` టైటిల్ వివాదం ముగిసిన‌ట్లు తెలుస్తోంది. రిజిస్టర్ చేయించుకున్న వారికి రూ. 25 లక్షల వరకు చెల్లించి.. టైటిల్ ను సొంతం చేసుకున్నారని తెలుస్తోంది. మొత్తానికి టైటిల్ ఇష్యూతో లియో నిర్మాత‌ల‌కు 25 ల‌క్ష‌లు బొక్క ప‌డిన‌ట్లు అయింది.