కీర్తి సురేష్ ఏడాది సంపాదన అన్ని కోట్ల.. ఆస్తి విలువ తెలిస్తే షాక్ అవుతారు..!!

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు. మహానటి సినిమాతో కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ నేను శైలజ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయం అయ్యింది. మహానటి సినిమాతో ఉత్తమమైనట్టుగా అవార్డు అందుకుంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో అనేక సినిమాల్లో నటించిన కీర్తి సురేష్ సోషల్ మీడియా వేదికలో కూడా కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకుంది. అయితే నిన్న పుట్టినరోజు సందర్భంగా పలు స్టార్ సెలబ్రిటీస్ ఫ్యాన్స్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

2000 లో బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన కీర్తి ప‌లు సినిమాల్లో నటించి మెప్పించింది. మలయాళ గీతాంజలి తో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది తమిళంలో ఇత్తు ఎన్న మాయం సినిమాలో తొలిసారిగా నటించిన కీర్తికి ఇన్‌స్టాగ్రామ్ లో 16.4 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. అయితే కీర్తి సురేష్ ప్రస్తుత ఆస్తుల విలువ రూ.40 కోట్లు. అంతేకాకుండా నెలకు దాదాపు రూ.35 లక్షల వరకు సంపాదిస్తుందట. దీని ప్రకారం కీర్తి ఏడాదికి నాలుగు కోట్ల ఆదాయాన్ని దక్కించుకుంటుంది. ఇక తన సోషల్ మీడియా వేదికగా ఏదైనా యాడ్ ప్రచారం చేయాలంటే రూ.25 లక్షల రెమ్యూనిరేషన్ పుచ్చుకుంటుందట.

ఇక‌ కీర్తికి కార్లు అంటే చాలా ఇష్టం అట‌.. ఇప్పటివరకు ఆమె చాలా కార్లు ట్రై చేసింది. ప్రస్తుతం తన వద్ద రూ. 60 లక్షల విలువైన వోల్వో 690, రూ. 1.38 విలువైన బిఎండబ్ల్యూ సెవెన్ సిరీస్ ఎల్‌డి, రూ.80 ల‌క్ష‌ల‌ విలువైన మెర్సాడెస్ బెంజ్‌, రూ.25 లక్షల విలువైన టయోటా ఇన్నోవా క్రిష్ట వంటి పలు రకాల ఖరీదైన కార్లు ఉన్నాయి. ఇటీవల బోళాశంకర్‌తో ఫ్లాప్‌ని ఎదుర్కొన్న కీర్తి సురేష్ సైరన్, రఘు తత్త, రివాల్వర్ రేటా, కని వేడి సినిమాల్లో నటిస్తుంది.